మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి నారద పుష్కరిణి తెప్పలపై శ్రీకాళహస్తీశ్వరుడు విహరిస్తూ భక్తులకు నయనానందం కల్పించారు. పట్టు వస్త్రాలు ,విశేష స్వర్ణాభరణాల మధ్య సర్వాంగ సుందరంగా ఉత్సవమూర్తులను వేర్వేరు తెప్పలపై ఉంచారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మేళ తాళాలు,, భక్తుల శివనామ స్మరణల మధ్య తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. నారద పుష్కరిణి అలలపై ఉత్సవ మూర్తులు ఐదు ప్రదక్షిణల అనంతరం ధూప ,దీప, నైవేద్య కైంకర్యాలు చేపట్టారు. తెప్పోత్సవం తిలకించేందుకు అశేషంగా భక్తులు తరలివచ్చారు
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025