నిడదవోలు మండలం శెట్టిపేట లో ఐ.యఫ్.టి.యు అనుబంధ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశం యూనియన్ సెక్రటరీ రావి వరహాల స్వామి అధ్యక్షతన నిర్వహించడమైనది.సమావేశంలో వరహాల స్వామి మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులంతా ఆం.ప్ర. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి లో సభ్యులు గా నమోదు కావాలని కోరారు. అనంతరం కార్మికులు మోకాళ్ళ పై కూర్చొని నిర్వహించిన నిరసన కార్యక్రమం లో ఐ.యఫ్.టి.యు జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ఆదేశాల( 1986 సం” లో) మేరకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటుచేసిన వెల్ఫేర్ బోర్డు నిధులను ప్రభుత్వం దారి మళ్లించిందనీ, అయితే గత ప్రభుత్వం ఇదేవిధంగా నిధుల దారి మళ్లింపుకు పాల్పడినప్పటికినీ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అరకొరగా ఐనా అమలు చేసిందనీ, వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొత్తం పధకాలు నిలిపి వేసి “ఆం.ప్ర.భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి” (ఎ.పి.బి.ఓ.సి )ని నిర్వీర్యం చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది రూపాయల పరిహారాలు పెండింగ్ లో ఉన్నాయనీ, సదరు పెండింగ్ క్లైములు లో కోసం భవన నిర్మాణ కార్మికులు ఎన్ని ఆందోళనలు చేసినా ప్రభుత్వం పాలకపక్షం తమకు సంబంధం లేనట్లు వ్యవహరిస్తోందనీ, త్వరలో ఎన్నికల కోడ్ రానున్నందున తక్షణమే సదరు నిధులు విడుదల చేసి, పేద శ్రమజీవుల పట్ల తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. పై కార్యక్రమంలో యూనియన్ నాయకులు పాటంశెట్టి రాజేష్, ఎల్లె రాజారావు, దిడ్ల నరేష్, చిన్నం మూర్తి, విజయ్, ఖండవల్లి దుర్గా రావు, సారె శ్రీను, దాసరి మురళి తదితరులు నాయకత్వం వహించారు.
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025