వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం చింతకుంటలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు కుమారులకు ఉరివేసి, అనంతరం తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది..
వికారాబాద్, నవంబర్ 1: వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం చింతకుంటలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు కుమారులకు ఉరివేసి, అనంతరం ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ధారూర్ సీఐ రఘురామ్ తెలిపిన వివరాల ప్రకారం.. చింతకుంటకు చెందిన భూపతిరెడ్డి పోలీసు శాఖలో పనిచేస్తున్నారు. ఆయన భార్య వాసవి (33). వీరికి సహర్షరెడ్డి (8), వేదార్షరెడ్డి (4) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పిల్లల చదువుల కోసం కుటుంబం వికారాబాద్‌లో నివాసం ఉంటోంది.
వారాంతపు సెలవు కావడంతో స్వగ్రామంలో గడిపేందుకు భూపతిరెడ్డి శనివారం భార్యాబిడ్డలను కారులో చింతకుంటకు తీసుకెళ్లారు. వారిని ఇంటి వద్ద దించి ఆయన తాండూరుకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉన్న వాసవి, బయట ఆడుకుంటున్న ఇద్దరు కుమారులను లోపలికి పిలిచింది. అనంతరం పడక గదిలో ఇద్దరు పిల్లలకు ఉరివేసి, మరో గదిలో తానూ ఆత్మహత్య చేసుకుంది. వాసవి మామ సాయిరెడ్డి ఈ ఘటనను గుర్తించి భూపతిరెడ్డికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ధారూర్ సీఐ రఘురామ్, ఎస్సై సురేశ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనకు దారితీసిన కారణాలు ఇంకా తెలియరాలేదు.
వాసవి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు
Also read
- గే డేటింగ్ యాప్‌లో పరిచయం.. తియ్యని మాటలతో యువకుడి కొంపముంచిన కేటుగాడు..
- Cyber Fraud: పోలీసు కానిస్టేబుల్‌కే టోకరా.. రూ.29 లక్షలు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు.. సైబర్ క్రైమ్‌లో కేసు నమోదు!
- హైదరాబాద్‌లో తీవ్ర విషాదం.. ఎనిమిదేళ్ల బాలుడు ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి!
- Raptadu Case Update: హేమంత్ కాలు తీసేయాల్సిందే.. రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై బిగ్ అప్డేట్
- వచ్చే నెలలో పెళ్లి.. అంతలోనే వెంటాడిన మృత్యువు.. అసలేం జరిగిందంటే?





