*కూటమి ప్రభుత్వంలో అధికారుల ధన దాహానికి దూకిన /తోయబడ్డ బ్రాహ్మణ ఉద్యోగి….*
*బాధిత కుటుంబానికి 5 కోట్ల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి…*
*సూసైడ్ నోట్ లో ఉన్న 4గురి పేర్ల పై మరణ వాంగ్మూలం గా భావించి చట్ట ప్రకారం ఎఫ్ఐఆర్ కట్టాలి….*
అమరావతి:
కూటమి ప్రభుత్వంలో అధికారులు తీరుకు నిదర్శనం బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్, బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండి, బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సీఈవో లు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని ఒక బ్రాహ్మణ ఉద్యోగి హత్య / ఆత్మహత్య చేసేలా తయారయ్యారని *బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ* విజయవాడ,
గొల్లపూడి లోని రాష్ట్ర ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో 26/10/26 సోమవారం విచారణ పేరుతో బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ విజయవాడ బ్రాంచ్ మేనేజర్ గుర్తి శ్రీనివాస శర్మను నిధులు దుర్వినియోగమైనయని విచారణ పేరుతో పిలిపించి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బొచ్చు రాంప్రసాద్, కార్పొరేషన్ ఎండి దేవాదాయ శాఖ అధికారి చంద్రశేఖర్ ఆజాద్, కోపరేటివ్ సొసైటీ సీఈఓ నాగసాయి, త్రిపుర సుందరి లు ఇతనిని విచారణ పేరుతో శారీరకంగా, మానసికంగా వేధించి బలవంతంగా కాగితాల మీద సంతకాలు చేయించారు. ఆ తర్వాత మేనేజర్ శ్రీనివాస్ (43) స్వగ్రామమైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఇరుసుమండ గ్రామానికి రికవరీ చేయడం కోసం బలవంతంగా కార్పొరేషన్ కార్యాలయంలో నుంచి కారులో ఎక్కించుకొని చంద్రశేఖర్ ఆజాద్ నాగసాయి త్రిపుర సుందరి లు కారులో తీసుకువెళ్లారు. మేనేజర్ శ్రీనివాస్ ఇంటికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న చించినాడ గోదావరి బ్రిడ్జి మద్యలో కారును ఆపి అతనంతట అతనే నదిలో దూకాడని ఈ అధికారులు ప్రచారం చేస్తున్నారు. అతను దూకాడ లేదు ఈ అధికారులే వాళ్ళ అవినీతిని కప్పిపెట్టేందుకు కోసం నదిలోకి నెట్టివేశారా అనేది అనేక అనుమానాలకు తావిస్తోందని, బ్రాంచ్ మేనేజర్ నిజంగా తప్పు చేస్తే చట్టప్రకారం కదా చర్యలు తీసుకోవాల్సిందని శ్రీధర్ అధికారులను ప్రశ్నించారు. చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని బలవంతంగా కాగితాల మీద సంతకాలు చేయించడం అధికారులే రికవరీ ఏజెంట్లుగా ఎందుకు మారారని శ్రీధర్ ప్రశ్నించారు. బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో 2016-17 స్థాపించిన దగ్గరనుంచి అనేక అక్రమాలు జరిగాయని తాను వాటిపైన గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నారని తెలియజేశారు. గతంలో పనిచేసిన సీఈవో అభిజిత్ కొన్ని కోట్ల రూపాయలు బ్రాహ్మణ సొమ్మును దుర్యోధయోగం చేస్తే ఎంతవరకు చర్యలు తీసుకోలేదు, గత టిడిపి ప్రభుత్వంలో నియమితులైన కో-ఆపరేటివ్ డిపార్ట్మెంట్ నుంచి 2017లో డిప్యూటేషన్ మీద వచ్చి ఈ సొసైటీలో సీఈవోగా నాగసాయి నియామకం జరిగినప్పటి నుంచి నేటి వరకు అతను ప్రభుత్వ సర్వీస్ రూల్స్ కి విరుద్ధంగా ఒకే చోట 9ఏళ్లపాటు సీఈవోగా కొనసాగుతున్నాడు. ఇది ప్రభుత్వ ఉద్యోగస్తుల సర్వీస్ రూల్స్ ప్రకారం 9 ఏళ్లు ఒకే చోట ఉద్యోగం చేసే విధంగా ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇతనికే ఎందుకు ఇస్తున్నారని, దీనిపై కూడా తాను పోరాటం చేశానని, అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఇతనిని CEO గా తొలగిస్తూ ఈ 3 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పాలనలో 3 సార్లు జీవోలు అధికారులు ఇవ్వడం జరిగిందని, అతను ఆ జీవోల ప్రకారం ఉద్యోగంలో నుంచి రిలీవ్ కాకుండానే, రోజుల్లోనే వెంటనే ఉన్నతాధికారులతో ఆ జీవోలు రద్దు చేయించి మరలా ఈ బ్రాహ్మణ సొసైటీకి సీఈవోగా నియామకం చేస్తున్న జీవోలు తెచ్చుకునేవాడని ఇది ఎలా సాధ్యపడుతుందని కూటమి ప్రభుత్వంలో ఉన్నతాధికారులను శ్రీధర్ ప్రశ్నించారు. గత వైసీపీ ప్రభుత్వంలో, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఈ సి ఈ ఓ నాగ సాయి అనేక అక్రమాలకు, అవినీతికి పాల్పడ్డాడని, రాష్ట్రవ్యాప్తంగా బ్రాహ్మణులు దాచిపెట్టుకున్న కొన్ని కోట్ల రూపాయల సొమ్మును దొంగ లెక్కలు చూపి పందికొక్కులా మెక్కేసాడని శ్రీధర్ ఆరోపించారు. సొసైటీ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి నేటి వరకు ప్రభుత్వ ఆడిట్ సంస్థ ద్వారా ఆడిట్ చేయించకుండా ప్రైవేటు ఏజెన్సీలతో ఆడిట్ చేయించాడని ఇది ప్రభుత్వ విభాగాల్లో ఎలా సాధ్యపడుతుందని కూటమి ప్రభుత్వ ఉన్నతాధికారులను శ్రీధర్ ప్రశ్నించారు. ఎండోమెంట్ కమిషనర్ ప్రధాన కార్యాలయంలో అధికారిగా పనిచేసే చంద్రశేఖర్ ఆజాద్ అవినీతి పైన ఈ కూటమి ప్రభుత్వమే విజిలెన్స్ విచారణ కమిటీ వేసిందని, అతన్ని ఇప్పటి వరకు పదుల సంఖ్యలో సస్పెండ్ అయ్యాడని, సస్పెన్షన్ అయిన రోజుల్లోనే మళ్ళా ఉద్యోగంలో చేరేవాడని ఇది ఎలా సాధ్యపడుతుందని ఉన్నతాధికారులని శ్రీధర్ ప్రశ్నించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ కి ఎండీ గా అవినీతి అధికారి చంద్రశేఖర్ ఆజాద్‌ను నియామకం చేయటం ఎంతవరకు సబబని, కో ఆపరేటివ్ సొసైటీ డిపార్ట్మెంట్లో నాగసాయి పై అనేక అవినీతి ఆరోపణలు గతంలో ఉంటే అతని తీసుకువచ్చి బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో సీఈఓ గా నియమించడం ఎంతవరకు సబబని, ప్రభుత్వంలో ఉన్నతాధికారులే దొంగల చేతికి తాళాలు అప్పజెప్పినట్లు చందంగా ఉన్నదని, ఇలాంటి ప్రభుత్వ అధికారుల మరియు సిబిఐ కేసుల్లో శిక్షలు పడి బెయిల్ పై బయట తిరుగుతున్న బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ధన దాహానికి ఒక బ్రాహ్మణ ఉద్యోగి నిండు ప్రాణం బలి కావడం జరిగిందని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని శ్రీధర్ ప్రశ్నించారు. ఇప్పటికే ఇరు తెలుగు రాష్ట్రాలలో వున్న బ్రాహ్మణ సంఘాలు, బ్రాహ్మణ సమాజం సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అనేక పోస్టులు పెట్టడం జరిగిందని, దీనిపైన బ్రాహ్మణ సంఘాలు ఉద్యమాలు చేయకముందే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోమ్ మినిస్టర్ దృష్టి సారించాలని, అతని హత్య/ ఆత్మహత్యకు కారకులు/ప్రేరేపకులు ఎవరు? అతని మరణించడానికి కారణాలు ఏమిటి అనే విషయాలన్నింటినీ అతను సూసైడ్ నోటు అతనే స్వయంగా టైప్ చేసి బ్రాహ్మణ వాట్సాప్ గ్రూపులలో పెట్టాడని, ఆ సూసైడ్ నోటు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బ్రాహ్మణ సమాజం చదివిందని, ఆ సూసైడ్ నోటు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్టింగ్ జడ్జితో పూర్తిస్థాయి విచారణ చేయించాలని, సూసైడ్ నోట్లో అతను రాసిన అంశాలు అతని చావుకి కారకులు ఎవరు అనేది 4 పేర్లు ఉదహరించాడని, వారందరిని చట్ట ప్రకారం తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి పూర్తిగా విచారించాలని, దోషులు ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు కూటమి ప్రభుత్వం తీసుకోవాలని అతని కుటుంబానికి 5 కోట్ల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇచ్చి తక్షణమే ఆదుకోవాలని, కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా శ్రీనివాస్ కుటుంబానికి న్యాయం చేయాలని శ్రీధర్ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేనియెడల దీని పైన రాష్ట్ర బ్రాహ్మణ సంఘాలు న్యాయపోరాటాలకి, నిరసనలకు సిద్ధమవుతాయని శ్రీధర్ తెలియజేశారు.
Also read
- మేము తప్పు చేస్తున్నామని తెలుసు.. కానీ, వేరే మార్గం లేదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న చివరి మెసేజ్!
- కూటమి ప్రభుత్వంలో అధికారుల ధన దాహానికి దూకిన /తోయబడ్డ బ్రాహ్మణ ఉద్యోగి….
- అన్న కోసం ప్రాణత్యాగం చేసిన చెల్లి- పైడితల్లి అమ్మవారి ఆలయ చరిత్ర ఇదే
- అక్టోబర్ 28న అట్లతద్ది- 11 అట్లు వాయనం ఇవ్వడం వెనుకున్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే!
- అట్లతద్ది యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత




