రంగారెడ్డి జిల్లా: మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి ఓ వివాహితను రిసార్ట్స్ కి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడిన సంఘటన ఘట్కేసర్ పీఎస్ పరిధిలో సోమవారం జరిగింది. ఇన్స్పెక్టర్ పి. కిరణ్ తెలిపిన మేరకు.. మల్లాపూర్‌కు చెందిన ఓ మహిళ (30) భర్తతో విడిపోయి టైలరింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరికి చెందిన జగన్మోహన్ మోత్కూరు మున్సిపాలిటీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.
ఇతడితో మహిళకు 4 నెలల క్రితం ఫోన్ ద్వారా పరిచయం ఏర్పడింది. తాను భువనగిరి మేనేజర్‌గా పని చేస్తానని, రూ.5 లక్షలు ఇస్తే మున్సిపల్ ఆఫీసులో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. దీంతో ఆమె సోమవారం రూ.4.5 లక్షలు సిద్ధం చేసుకోగా, జగన్మోహన్ కారులో వెళ్లి మల్లాపూర్‌లో ఎక్కించుకుని భువనగిరికి బయలుదేరారు. ప్రయాణించే సమయంలోనే డబ్బు తీసుకొని కారులో భద్రపరుచుకున్నాడు. భువనగిరికి వెళ్లకుండా ఎదులాబాద్ డివిజన్ అవుషాపూర్ వద్ద శ్రీనిధి రిసార్ట్స్ కి కారును మళ్లించగా బాధితురాలు అనుమానంతో ప్రశ్నించింది.
డబ్బులు తీసుకునే అధికారి రిసార్ట్స్ ఉన్నాడని బదులిచ్చాడు. లోపలికి వెళ్లిన అనంతరం రిసార్ట్స్ లోని ఓ గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అధికారిని కలుద్దామని ఆమె కోరడంతో కారులో ఎక్కించుకుని ఆమె ముఖంపై చేతులతో దాడి చేసి బయటకు తోసేసి వెళ్లిపోయాడు. బాధితురాలు 100కు డయల్ చేయగా ఘట్కేసర్ పోలీసులు వచ్చి భరోసా కేంద్రానికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జగన్మోహన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also read
- అన్న కోసం ప్రాణత్యాగం చేసిన చెల్లి- పైడితల్లి అమ్మవారి ఆలయ చరిత్ర ఇదే
- అక్టోబర్ 28న అట్లతద్ది- 11 అట్లు వాయనం ఇవ్వడం వెనుకున్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే!
- అట్లతద్ది యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ మహిళపై లైంగిక దాడి




