SGSTV NEWS online
CrimeNational

Fake Bomb Threat Case:800 బాంబు బెదిరింపులు.. చివరకు చెన్నెలో చిక్కిన నిందితుడు!




దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తించిన ఫేక్ బాంబు బెదిరింపుల పరంపరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు తెరదించారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)తో పాటు దేశంలోని ప్రధాన విమానాశ్రయాలకు నకిలీ బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ పంపుతున్న ప్రధాన నిందితుడిని ప్రత్యేక బృందం చాకచక్యంగా చెన్నైలో అరెస్ట్ చేసింది.

సాఫ్ట్వేర్ ఇంజనీర్ వికృత చేష్టలు పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. చెన్నైకి చెందిన శరత్ సుబ్రహ్మణ్యం సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. తమిళనాడులోని డీఎంకే (DMK) పార్టీ నాయకులపై ఉన్న వ్యక్తిగత కోపం, కక్షతోనే ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఎయిర్పోర్టులకు బాంబు బెదిరింపులు పంపి, ఆ నేరాన్ని సదరు డీఎంకే నేతలపై నెట్టి వారిని ఇబ్బందుల్లోకి నెట్టాలని, పోలీసుల చర్యలు వారిపై ఉంటాయనే దురుద్దేశంతోనే ఈ నకిలీ ఈ-మెయిల్స్ పంపినట్లు విచారణలో నిందితుడు స్పష్టం చేశాడు.

దేశవ్యాప్తంగా 800 మెయిల్స్.. శంషాబాద్క 45 సార్లు నిందితుడు గత రెండు ఏళ్ళు గా, (2025, 2026) నిరంతరాయంగా ఎయిర్పోర్టుల భద్రతా విభాగానికి నకిలీ మెయిల్స్ పంపిస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు.. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మాత్రమే ఏకంగా 45 సార్లు ఫేక్ బాంబు బెదిరింపు మెయిల్స్ పంపాడు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ విమానాశ్రయాలకు కలిపి మొత్తం 800 వరకు బెదిరింపు మెయిల్స్ పంపినట్లు దర్యాప్తులో నిర్ధారణ అయింది.

చెన్నైలో పక్కా ప్లాన్తో పట్టివేత.. రిమాండ్కు తరలింపు టెక్నాలజీని ఉపయోగించి గుర్తింపు చిక్కకుండా బెదిరింపులకు పాల్పడుతున్న నిందితుడి కోసం శంషాబాద్ డీసీపీ, ఏసీపీ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సైబర్ నిఘా, సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుడు చెన్నైలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. అక్కడికి వెళ్లి శరత్ సుబ్రహ్మణ్యాన్ని అదుపులోకి తీసుకున్నారు. చెన్నె నుంచి హైదరాబాద్ శంషాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించి లోతుగా విచారించారు. అనంతరం నిందితుడిపై సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు.

Also read

Related posts