SGSTV NEWS online
Andhra PradeshCrime

ఉద్రిక్తత.. బిర్యానీ తిని ఇద్దరు చిన్నారులు మృతి?



గుంటూరు : పొన్నూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. బ్రాహ్మణ కోడూరు గ్రామంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఆదివారం రాత్రి బిర్యానీ తిన్న అనంతరం అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన కుటుంబసభ్యులు,స్థానికులు చిన్నారుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే, సవతి తల్లి మేరీ పిల్లలకు విషమిచ్చి చంపిందని బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. చిన్నారుల మృతదేహాలతో బంధువులు, గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. సవతి తల్లి మేరీని తమకు అప్పగించాలని పీఎస్ ఎదుట ధర్నాకు దిగారు. పోలీసు జీపుపై బంధువులు దాడికి దిగారు. దీంతో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Also read

Related posts