SGSTV NEWS online
Andhra PradeshAP Local Body Elections

AP Municipal Elections: ఏపీలో మున్సిపల్‌ ఎన్నికలు రీషెడ్యూల్.. మళ్లీ ఎప్పుడంటే?



ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని జరగబోయే 99 పట్టణ, నగర స్థానిక సంస్థల ఎన్నికలను రీషెడ్యూల్ చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను నాలుగు రోజుల పాటు వాయిదా వేస్తూ కొత్త తేదీలను ప్రకటించింది.




ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రీషెడ్యూల్ చేస్తూ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28 జరగాల్సిన ఎన్నికలను నవంబర్ 1వ తేదీకి రెషెడ్యూల్ చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అలాగే ఫలితాలను నవంబర్ 3న రిలీజ్ చేయనున్నట్టు పేర్కొంది. ఈ నెల 25న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారమని ఈసీ పేర్కొంది.


అయితే మైదుకూరు పోలింగ్ తేదీపై మాత్రం ఈసీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మిగతా స్థానిక సంస్థలకు నవంబర్ 1న పోలింగ్ ఖరారైనప్పటికీ, మైదుకూరు పోలింగ్ తేదీని మాత్రం ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించలేదు. మైదుకూరులో మళ్లీ నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాతే పోలింగ్ నిర్వహించనున్నట్టు పేర్కొంది.

మరోవైపు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ మాత్రం ముందుగా నిర్ణయించిన ప్రకారం నవంబర్ 3వ తేదీనే జరగనుంది.

Also read

Related posts