SGSTV NEWS online
Andhra PradeshCrime

ఆర్టీసీ బస్సులో సీటు కోసం రగడ.. కర్రలు, ఇనుప రాడ్లతో ఓ కుటుంబంపై దాడి



ఏలేశ్వరం, : ఆర్టీసీ బస్సులో సీటు కోసం మొదలైన వాగ్వాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఓ కుటుంబంలోని నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.రాజమహేంద్రవరానికి చెందిన గారా అప్పారావు కుటుంబసభ్యులతో కలిసి శనివారం తునిలో బస్సు ఎక్కారు. అందులో అప్పటికే కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం సిరిపురానికి చెందిన నలుగురు మహిళలు ప్రయాణిస్తున్నారు. సీట్ల విషయంలో వీరి మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారితీసింది.

సిరిపురం మహిళలు బంధువులకు ఫోన్ చేసి తమతో కొందరు అసభ్యంగా ప్రవర్తించారని చెప్పడంతో.. రాత్రి 9 గంటల సమయంలో కొంతమంది వ్యక్తులు చిన్నింపేట సెంటరులో బస్సులోకి ప్రవేశించారు. అప్పారావు, ఆయన భార్య, కుటుంబసభ్యులపై కర్రలు, ఇనుపరాడ్లతో దాడికి దిగడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో భయపడిపోయిన అప్పారావు సోదరుని కుమార్తెలు ఇద్దరికి ఫిట్స్ రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

Also read

Related posts