అమరావతి : స్థానిక సంస్థల ఎన్నికల్లో శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టేందుకు వైపిసి ప్రయత్నిస్తోందని
జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్, ఉపాధ్యక్షుడు బి మహేందర్రెడ్డి, చేనేత వికాస విభాగం చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. నామినేషన్ల ప్రక్రియలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే చర్యలను సహించబోమని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని కోరారు. శనివారం జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. నామినేషన్ కేంద్రంలోకి నిబంధనలకు విరుద్ధంగా పెద్ద సంఖ్యలో ఎంపి తన అనుచరులతో ప్రవేశించేందుకు ప్రయత్నించడం సరికాదని పేర్కొన్నారు. 2021 స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జరిగిన ఘటనల తరహాలో ఇప్పుడు వ్యవహరిస్తే కుదరదని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల నిర్వహణలో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి, ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని అన్నారు. స్థానిక ఎన్నికల ప్రక్రియకు ఆటంకాలు కలిగించే చర్యలకు పాల్పడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Also read
- Hyderabad: కాలేజీలో దాండియా ఈవెంట్లో ప్రమాదం.. ఒకరు మృతి
- స్నేహితులతో సరదాగా ఈతకు వెళ్లి విగతజీవులుగా.. కేటీపీఎస్ కాలువలో మునిగి ఇద్దరు మృతి!
- స్థానిక ఎన్నికల్లో వైపిసి అరాచకం : జనసేన
- ఆర్టీసీ బస్సులో దారుణం.. సీటు ఇవ్వలేదని కర్రలు, రాడ్లతో మహిళలపై దాడి..!
- ఛీ.. ఛీ.. అమ్మతనానికే మాయని మచ్చ.. సహజీవనానికి అడ్డుగా ఉందని కన్న కూతురినే కొరికి..





