సికింద్రాబాద్ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కౌకూరు విల్లా ఆర్కిడ్స్లో అదృశ్యమైన ఆరేళ్ల చిన్నారి అరులియా మోజెస్ శవమై తేలింది. కిడ్నాప్ అయిందనుకున్న పాప హత్యకు గురవ్వడం స్థానికంగా తీవ్ర కలకలం రేపగా.. ఆ చిన్నారిని అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డ్‌గా పనేచేసే వ్యక్తే హత్య చేసినట్టు తెలియడంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
సికింద్రాబాద్‌లో ఆరేళ్ల చిన్నారి అరులియా మోజెస్ అదృశ్యం విషాదంతంగా మారింది. కిడ్నాప్‌కు గురైందనుకున్న చిన్నారి.. క్లబ్‌హౌస్ సెల్లార్లో శవమై కనిపించింది. అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేసే వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు పోలీసులు. పాప కనిపించకుండా పోయినప్పటి నుంచి పోలీసులు కిడ్నాప్ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డు విక్రమ్ మొబైల్ లొకేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ముగియడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విల్లా కాలనీతో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, పరిసర లాడ్జీలను జల్లెడ పట్టారు. డ్రోన్స్ సహాయంతో విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.
ఈ క్రమంలో క్లబ్‌హౌస్ సమీపంలో ఉన్న సైకిల్‌ను గమనించిన పోలీసులు అక్కడ తనిఖీలు చేపట్టగా, చివరకు సెల్లార్ నీటిలో చిన్నారి మృతదేహం లభ్యమైంది. పోలీసులు చిన్నారి డెడ్‌బాడీని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
డబ్బుల కోసమే ఘాతుకం?
పోలీసుల ప్రాథమిక అంచనా ప్రకారం.. సెక్యూరిటీ గార్డు విక్రమ్ ముందుగా పాప కాళ్లు, చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి, తండ్రికి ఫోన్ చేసి రూ. 20 లక్షలు డిమాండ్ చేయాలని ప్లాన్ చేశాడు. అయితే, ఎక్కడ దొరికిపోతానోనన్న భయంతో చిన్నారి గొంతు నులిమి చంపేసి, మృతదేహాన్ని సెల్లార్ నీటిలో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
నిందితుడి కోసం గాలింపు
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఇద్దరు బిహారీలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు విక్రమ్ కోసం మల్కాజిగిరి జోన్ పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు ఇలా దారుణ హత్యకు గురికావడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Also read
- చాక్లెట్ చూపించి ట్రాప్.. పాప కిడ్నాప్‌కు ముందు దుర్మార్గుడు ఏం చేశాడంటే.. సంచలన నిజాలు..
- దారుణం.. కన్నతల్లిపై డీజిల్ పోసి సజీవ దహనం చేసిన కుమారుడు! ఎక్కడంటే..
- ఆ శాఖల ఉద్యోగులే టార్గెట్.. ఫోన్ చేసి మాట్లాడుతారు.. ఆ తర్వాతే అసలు కథ మొదలైద్ది..
- ఎంత కుమిలిపోయిందో పాపం.. పిల్లలో కలిసి బావిలో దూకి తల్లి ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే?
- Telangana: కిరాయి కోసమని వెళ్లి.. అడవిలో శవమై కనిపించిన ఆటో డ్రైవర్.. ఏం జరిగిందో తెలిస్తే..





