SGSTV NEWS online
CrimeTelangana

ప్రేమ పేరుతో వేధింపులు.. 15 ఏళ్ల బాలిక బలవన్మరణం!

సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు

తెలంగాణ: ప్రేమపేరిట వేధింపులు భరించలేక ఓ విద్యార్థిని
ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, సీఐ రవీందర్ కథనం ప్రకారం.. లింగంపేటకు చెందిన గౌతమి (15) మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది. కొంతకాలంగా ఇదే స్కూల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థి, గౌతమిని ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాడు.

ఈ విషయంలో సదరు విద్యార్థిని గత నెలలో గౌతమి కుటుంబ సభ్యులు హెచ్చరించినా అతడిలో మార్పు రాలేదు. తరచూ ఫోన్కాల్స్, ఇన్స్టాగ్రామ్ ద్వారా సందేశాలు పంపుతూ వేధింపులకు గురి చేశాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన గౌతమి శనివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు గౌతమి రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.

Also read

Related posts