SGSTV NEWS online
Andhra PradeshCrime

విశాఖలో నాలుగేళ్ల బాలిక కిడ్నాప్.. తల్లిదండ్రుల పక్కన నిద్రిస్తుండగా మాయం


విశాఖ: విశాఖపట్నం రైల్వే స్టేషన్ సమీపంలో ఫుట్పాత్పై తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న నాలుగేళ్ల బాలిక కిడ్నాప్ నకు గురైన ఘటన కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన సయ్యద్ అబ్దుల్ హఫీజ్ గని, సయ్యద్ శేషమ్మ దంపతులు దుకాణాల్లో ధూపం వేస్తూ జీవనం సాగిస్తున్నారు.

మూడు రోజుల క్రితం విజయవాడ నుంచి విశాఖకు వచ్చిన వారు.. రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న బస్టాప్ వద్ద తమ నాలుగేళ్ల కుమార్తెతో కలిసి ఫుట్పాత్పై నిద్రించారు. అయితే అర్ధరాత్రి మెలకువ వచ్చాక చూస్తే బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. ఎస్.రాయవరం ప్రాంతానికి చెందిన ప్రతిభ, గరివిడి ప్రాంతానికి చెందిన ఉపేంద్ర అనే ఇద్దరు స్కూటీపై వచ్చి బాలికను తీసుకెళ్లినట్లు గుర్తించారు.


సీసీటీవీ దృశ్యాల్లో బాలికను గాజువాక వైపు తీసుకెళ్లినట్లు ఉంది. స్కూటీ నంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుల నుంచి బాలికను రక్షించారు. దర్యాప్తు కొనసాగుతోంది.

Also read

Related posts