ఎల్కతుర్తి హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో మహిళ మృతి కేసును పోలీసులు చేదించారు. 3 రోజుల క్రితం కారు డిక్కీలో మహిళ మృతదేహం లభ్యం కావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతురాలిని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మానస (33)గా గుర్తించారు. మానస తండ్రీ హత్య చేయించినట్లు దర్యాప్తులో తేల్చారు. ఎల్కతుర్తికి చెందిన ప్రియుడు వినోద్కుమార్ను పోలీసులు అరెస్ట్ చేసి ప్రశ్నించగా.. మానస తండ్రి రాజేశం ఆదేశం మేరకే చంపినట్లు వెల్లడించాడు.
కాజీపేట ఏసీపీ పింగళ ప్రశాంత్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మానసకు ఇది వరకే రెండు వివాహాలు జరిగి విడాకులు అయ్యాయి. అనంతరం పుట్టింట్లో ఉంటోంది. ఆ తర్వాత కరీంనగర్ కు చెందిన వినోద్ కుమార్ సన్నిహితంగా ఉంటోంది. గతవారం ఆరుణాచలం వెళ్తున్నట్లు చెప్పి వినోద్ గదికి వెళ్లింది. పెళ్లి చేసుకోవాలని అతడిపై ఒత్తిడి తెచ్చింది. దీంతో వినోద్.. మానస తండ్రి రాజేశంకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. తమ మాట వినకుండా ఆమె ఇష్టారీతిన తిరుగుతోందని, కుటుంబసభ్యులను ఇబ్బందులకు గురిచేస్తోందని తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. మానస వల్ల పరువు పోతోందని.. చంపేయమని వినోద్ కు చెప్పాడు. ఏదైనా చేసి ఆమె వల్ల ఇబ్బంది లేకుండా చూడాలని కోరాడు. పెళ్లి చేసుకోవాలని వేధిస్తుండటం, తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతుండటంతో మానస, వినోద్ మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో వినోద్.. మానస గొంతు నులిమి చంపేశాడు. ఆనంతరం కారు డిక్కీలో మృతదేహాన్ని పెట్టి ఎల్కతుర్తిలోని తన ఇంటి పరిసరాల్లోకి తీసుకెళ్లాడు. మృతదేహాన్ని పాతి పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తుండగా దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎల్కతుర్తి శివారులో వినోద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు.
Also read
- ఆమె వల్ల పరువు పోతోంది.. చంపేయ్.. కుమార్తెను ప్రియుడితో చంపించిన తండ్రి
- కేపీహెచ్బీలో విషాదం.. ఐదో అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య
- మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
- ఫోక్సో కేసులో యువకుడి అరెస్ట్.. ఆరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా పోలీసులకే ట్విస్ట్ ఇచ్చిన నిందితుడు!
- ఓరి నాయనో..వీళ్లేం విద్యార్థులు బాబోయ్…నర్సింగ్ హాస్టల్లో అమ్మాయిల విధ్వంసం భయానకం..!





