విశాఖపట్నం: నగరంలో సంచలన ఘటన చోటు చేసుకుంది. షీలానగర్ జంక్షన్ వద్ద మట్టికుప్పలో మూడు మృతదేహాలు బయటపడటంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. లారీలోకి మట్టి ఎత్తి వేస్తుండగా మూడు మృతదేహాలు కనిపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
మట్టిని లారీలోకి ఎక్కిస్తున్న సమయంలో కూలీలు మృతదేహాలను గుర్తించినట్లు తెలుస్తోంది. అవి పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో మృతులు ఎవరు, ఎంతకాలం క్రితం మృతి చెందారు అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మట్టికుప్పను పరిశీలించి మృతదేహాలను బయటకు తీశారు. ఘటనాస్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించారు. మృతదేహాల పరిస్థితి, వాటిపై ఉన్న ఆనవాళ్లను పరిశీలించి ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు.
మృతులు ఎవరు? వారు షీలానగర్ ప్రాంతానికి చెందినవారా? మృతదేహాలు మట్టికుప్పలోకి ఎలా వచ్చాయి? ఎవరైనా కావాలనే అక్కడ పడేసి వెళ్లారా? లేక మరేదైనా ఘటనకు సంబంధించినవా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- వామనుడు తపస్సు చేసిన గోదావరి తీర క్షేత్రం- ఒకే చోట మూడు ప్రసిద్ధ ఆలయాలు- ఒక్కసారి దర్శిస్తే కష్టాలన్నీ మటుమాయం!
- నేటి జాతకములు..3 అక్టోబర్, 2026
- హిజ్రాలు కాదు.. మగవాళ్లే! బీఎండబ్ల్యూ కారు ఆపి మరీ..
- విదేశీ యువతులతో వల.. హైదరాబాద్లో హైటెక్ దందా..! కథ మామూలుగా లేదుగా..
- నర్సింగ్ విద్యార్థిని హత్య కేసులో సంచలన ట్విస్ట్.. చంపిందెవరో తెలిసి షాక్!





