SGSTV NEWS online
CrimeTelangana

నర్సింగ్ విద్యార్థిని హత్య కేసులో సంచలన ట్విస్ట్.. చంపిందెవరో తెలిసి షాక్!


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల జరిగిన నర్సింగ్ విద్యార్థిని హరిణి మృతి మిస్టరీ వీడింది. ప్రియుడే కాలయముడిగా మారి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. జూలూరుపాడు మండలం వెంగన్నపాలెంలో దారుణంగా హత్యకు గురైన హరిణి మృతి మిస్టరీ వీడింది. హరిణి ప్రియుడు అయిన దేవరకొండ పవన్ కుమార్ హరిణిపై అనుమానంతో.. ఆమె మెడకు వైరు బిగించి చంపాడు. అనంతరం పారిపోయాడని కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ తెలిపారు. నిందితుడు పవన్ కుమార్ ను అరెస్టు చేసి అతని వద్ద హత్యకు ఉపయోగించిన వైరు తో పాటు ద్విచక్రవాహనంను సీజ్ చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడని డీఎస్పీ తెలిపారు.


2017 నుండి ఇరువురు నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇది కుటుంబాల మధ్య గతంలోనే గొడవలు ఉండడంతో హరిణి, పవన్ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. కొన్నాళ్లు దూరంగానే ఉన్న పవన్, హరిణిని వెంటబడి మళ్లీ దగ్గర అయ్యేందుకు ప్రయత్నించాడు. పవన్ తీరు సరిగా లేకపోవడం చెడు అలవాట్లు కారణంగా అతన్ని హరిణి దూరం పెడుతూ వచ్చింది. తన ఇంస్టాగ్రామ్ ఐడీని కూడా మార్చుకుంది. ఇక్కడి నుంచి వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.

హరిణి మరో యువకుడితో ప్రేమలో ఉందని అనుమానించిన పవన్ ఆమెపై మరింత కోపం పెంచుకున్నాడు. సెప్టెంబర్ నెల 21వ తేదీన హరిణి ఇంటికి వెళ్ళి.. ఆమెతో పెళ్లి చేసుకోవాలని వాగ్వాదానికి దిగాడు పవన్. ఆమె అందుకు నిరాకరించడంతో ముందుగానే తాను వెంట తెచ్చుకున్న తాడుతో మెడకు బిగించి హత్య చేశాడు. అనంతరం భయంతో హరిణి కాళ్ళు పట్టుకుని బయటకు లాక్కుని వచ్చి బాత్రూమ్ పక్కన పడేసి పారిపోయాడు. ఆమె తల్లి ఇంటికి వచ్చి చూడగా విగత జీవిగా ఉన్న కూతురిని చూసి గుండెలవిసేలా రోదించింది.


తన బిడ్డను అదే కాలనీకి చెందిన పవన్ పెళ్లి చేసుకోవాలని కొంతకాలంగా వేధిస్తున్నాడని అతని హత్య చేశాడంటూ పోలీసులకు తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, పవన్‌ను నిందితుడిగా గుర్తించారు. పరారీ లో ఉన్న నిందితుడు పవన్ ను పది రోజుల తర్వాత అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Also read

Related posts