బాలాసోర్ జిల్లాలోని సిములియా బ్లాక్లో శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవాల కోసం జాతీయ జెండాను ఎగరవేసే పోల్ ను క్లిన్ చేస్తున్నారు. ఇంతలో అది కాస్త కరెంట్ తీగల మీద పడటంతో అక్కడున్న టీచర్ కరెంట్ కు గురైయ్యాడు. మరో ముగ్గురు విద్యార్థులకు సైతం షాక్ కు గురయ్యారు. ఈ ఘటన స్థానికంతో తీవ్ర విషాదంగా మారింది.
దేశ వ్యాప్తంగా ఇండి పెండెన్స్ వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ దాక త్రివర్ణ పతాకం రెపరెపలాడింది.ఈ నేపథ్యంలో ఒడిశాలోని బాలాసోర్ లోని ఒక స్కూల్ లో జాతీయ జెండా ఎగర వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది కాస్త తీవ్ర విషాదకరంగా మారింది. బాలాసోర్ జిల్లాలోని సిములియా బ్లాక్లో శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవ పతాకావిష్కరణ సన్నాహాల సందర్భంగా పోల్ ను త్రివర్ణ పతాకాల రిబ్బన్ లతో డెకొరెట్ చేస్తున్నారు. ఇంతలో ఆ పోల్ కాస్త కరెంట్ తీగలకు తాకింది. దీంతో వెంటనే కరెంట్ ప్రసారం కావడంతో పీఈటీ టీచర్ స్పాట్ లోనే చనిపోయారు.
మరో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆ స్కూల్ లో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణంనెలకొంది. టీచర్ లు, విద్యార్థుల్ని ఆస్పత్రికి తరలించగా టీచర్ అప్పటికే చనిపోయినట్లు చెప్పారు. చనిపోయిన టీచర్ ప్రియబ్రాత్ బెహెరాగా, జలేశ్వర్ ప్రాంతమని అక్కడి వారు వెల్లడించారు. అతను సిములియాలోని మైతాపూర్ ప్రాంతంలో ఒక ప్రైవేట్ విద్యా సంస్థలో పీఈటీగా పనిచేస్తున్నాడు. గాయపడ్డ ముగ్గురు విద్యార్థులకు వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారు.
పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి ఒకరు మాట్లాడుతూ, “ఈ సంఘటన జరిగినప్పుడు, టీచర్, కొంతమంది విద్యార్థులు జెండా స్తంభాన్ని పాతుతున్నారని చెప్పాడు. ఆ ఇనుప స్తంభం అదుపు తప్పి విద్యుత్ తీగను తాకిందని, ఉపాధ్యాయుడితో పాటు నలుగురు నుంచి ఐదుగురు విద్యార్థులు ఉన్నారని చెప్పారు. ప్రమాదం జరిగిన తర్వాత, స్థానికులు, పాఠశాల సిబ్బంది తీవ్రంగా గాయపడిన ఉపాధ్యాయుడిని భద్రక్ జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. అయితే, అతను అక్కడికి చేరుకునేసరికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
విద్యుదాఘాతానికి గురై గాయపడిన మరో ముగ్గురు విద్యార్థులను వెంటనే సిములియా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చేర్పించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని, వారికి అక్కడే చికిత్స జరుగుతోందని చెప్పారు. ఈ ఘోర ప్రమాదంపై పాఠశాల సిబ్బంది తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
Also read
- Odisha: జెండా వేడుకలో పెను విషాదం.. టీచర్ మృతి, ముగ్గురు విద్యార్థులకు తీవ్రగాయాలు.. ఏంజరిగిందంటే..?.
- పుష్య నక్షత్రంలో గురు మార్పులు.. ఆగస్టు 19 వరకు ఈ రాశుల జాతకం అమాంతం మారబోతోంది
- పరిచయం లేదు.. పగ లేదు.. కేవలం కుక్క చేసిన పనికి యువకుడి ప్రాణమే పోయింది!
- ఆలయంలో దారుణం.. మైనర్పై అర్చకుడి లైంగిక వేధింపులు
- అయ్యో ఎంత పని చేశావ్ తల్లి.. ఉరివేసుకొని 5వ తరగతి బాలిక ఆత్మహత్య.. ఎందుకంటే?





