మచిలీపట్నం
2/08/2026
చంద్రబాబు సారధ్యంలో అభివృద్ధి పథం…..
మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలసౌరి ల సారధ్యంలో ఎంతో అభివృద్ధి జరుగుతోంది….
కూటమి కలయికే అభివృద్ధి….. బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్, స్వర్ణ వార్డు 45 తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్, పి. వి. ఫణి కుమార్…..
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలు రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి_సంక్షేమం కార్యక్రమంలో భాగంగా ఆదివారం స్వర్ణ వార్డు 45 నందు బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్, స్వర్ణ వార్డు 45 తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్,
పి. వి. ఫణి కుమార్ ఇంటింటికి
కూటమి ప్రభుత్వ సంక్షేమ విజయాలు వివరిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు….
ఈ సందర్భంగా బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్, స్వర్ణ వార్డు 45 తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, పి. వి. ఫణి కుమార్ మాట్లాడుతూ……
మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలసౌరి ల సారధ్యంలో మచిలీపట్నం నియోజకవర్గం ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తోంది అన్నారు.
సూపర్ సిక్స్ హామీలు, పొందిన లబ్ధిని ప్రజలకు వివరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజలను చైతన్య పరచడమే లక్ష్యమని పేర్కొన్నారు.
ముఖ్యంగా స్వర్ణ వార్డు 45 నందు మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి ల సహాయ సహకారాలతో డ్రైనేజీల నిర్మాణం, ఎమ్మార్వో ఆఫీస్ కార్యాలయంలో మరుగుదొడ్ల నిర్మాణం, ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నారు.
గత వైసిపి ప్రభుత్వం హయాంలో కోట్లాది రూపాయల ఆస్తిని డివిజన్లో కబ్జా చేసి వైసిపి కార్యాలయం మాత్రం కట్టుకున్నారు కానీ, డివిజన్ అభివృద్ధికి వైసిపి నాయకులు
చేసింది ఏమీ లేదని మండిపడ్డారు.
కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలు కార్యక్రమంలో భాగంగా డివిజన్లో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుని డివిజన్ ప్రజలకు ఆ సమస్యలు తీర్చేలా మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి, ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి డివిజన్లో ప్రజలకు ఒక సేవకుడిలా పనిచేస్తానని
పి. వి. ఫణి కుమార్ ప్రజలకు వివరిస్తూ ఇంటింటికి కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షుడు, గంజాల రవికుమార్, కోమటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Also read
- మరో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ – ఏడుగురు విద్యార్థులకు అస్వస్థత
- గొంతు, మర్మాంగం కోసి యువకుడి హత్య
- చంద్రబాబు సారధ్యంలో అభివృద్ధి పథం…..
- పిల్లల ప్రాణాలు పోలేదుగా.. చిన్న గీతే కదా! వార్డెన్ సమాధానం
- మూసీ బ్రిడ్జిపై తప్పిన విషాదం!





