మిమ్మల్ని ఇష్టపడ్డాడు, రమ్మంటున్నాడని మరో కార్మికుడితో అడిగిస్తున్నాడు
విచారణ కమిటీ ముందు పారిశుద్ధ్య కార్మికురాలి ఆవేదన
బెజవాడ జీజీహెచ్ సూపర్ వైజర్ లైంగిక వేధింపులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ‘నిన్ను ఇష్టపడుతున్నాను.. ఒకసారి రావాలి’ అంటూ కార్మికుడు సతీష్ ద్వారా కొన్నాళ్లుగా సూపర్వైజర్ సోమరాజు తనను వెంటాడుతున్నాడంటూ విజయవాడ జీజీహెచ్ పారిశుద్ధ్య కార్మికురాలు గురువారం విచారణ కమిటీ ముందు ఆవేదన వ్యక్తం చేసింది. ఏడాదిగా ఒత్తిడి చేస్తూ లైంగికంగా వేధిస్తున్నాడని వాపోయింది. మాట వినకపోవడంతో పని సరిగా చేయడం లేదని మరింత వేధిస్తున్నట్లు విచారణ అధికారులకు తెలిపింది.
మరికొందరు కార్మికులూ అకారణంగా కేకలు వేస్తూ రుబాబు చేస్తుంటాడని సూపర్వైజర్పై ఫిర్యాదుచేశారు. ఇదిలా ఉంటే వార్డుల్లో హైజీన్ సరిగా ఉండటం లేదని ఇన్ఫెక్షన్ కంట్రోల్ మేల్ నర్సు తమను వేధిస్తున్నారని మహిళా కార్మికులు ఫిర్యాదు చేశారు. విచారణ కమిటీ ఇచ్చిన నివేదికను కలెక్టర్, రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులకు పంపుతున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ రఘునందన్ తెలిపారు.
అసలేం జరిగిందంటే..
ఇటీవల జీతాల కోసం కలెక్టరేట్ వద్ద శానిటేషన్ కార్మికులు ధర్నా చేశారు. ఆ సమయంలో ఆస్పత్రిలో సూపర్వైజర్ సోమరాజు తమను వేధింపులకు గురి చేస్తున్నారని, ఒక్కొక్కరినీ ఒక్కో విధంగా చూస్తున్నారంటూ కార్మికులు మండిపడ్డారు. సూపర్వైజర్తోతోపాటు మరో కార్మికుడు తనను లైంగికంగా వేధిస్తున్నారని ఓ మహిళా కార్మికురాలు ఆవేదన వ్యక్తం చేసింది. వీటిపై మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రఘునందన్ విచారణ కమిటీని నియమించారు. ఆ కమిటీ శుక్రవారం విచారణ పూర్తిచేసి ఇచ్చిన నివేదికను కలెక్టర్, డీఎంఈలకు పంపించనున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ రఘునందన్ తెలిపారు. ఈ విచారణలో కమిటీ సభ్యులు లైంగిక వేధింపుల ఆరోపణలను నిర్ధారించినట్టు సమాచారం
Also read
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!
- వరాహ జయంతి సెప్టెంబర్ 13నా.. 14నా? తేదీ, శుభ సమయం, పూజా విధానం ఇదే!





