హైదరాబాద్: నగరంలోని మియాపూర్ వైశాలి నగర్ విషాద ఘటన చోటుచేసుకుంది. మ్యాన్హాల్లో ప్రమాదవశాత్తు పడి బాలయ్య అనే వ్యక్తి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న వెంటనే హైడ్రా (HYDRAA), ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే గంటల తరబడి గాలించినా.. ఇంకా బాలయ్య ఆచూకీ చిక్కలేదని తెలుస్తోంది.
స్థానికుల సమాచారం ప్రకారం.. వైశాలి నగర్ ప్రాంతంలో బాలయ్య మంగళవారం అండర్పాస్ వద్ద తెరిచి ఉన్న మ్యాన్హాల్లో ప్రమాదవశాత్తు పడిపోయాడు. కూతురి ఇంటికి వెళ్లే క్రమంలో ఈ ఘటన జరిగింది. గమనించిన కొందరు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. దీంతో సహాయక బృందాలు అక్కడికి చేరుకున్నాయి.
హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ రంగప్రవేశం
బాలయ్య ఆచూకీ కోసం హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు. మ్యాన్హాల్ పరిసరాల్లో, డ్రైనేజీ మార్గాల్లో గాలింపు కొనసాగిస్తున్నారు. లోపల పరిస్థితులను పరిశీలిస్తూ సురక్షితంగా బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
స్థానికుల్లో ఆందోళన
ఈ ఘటనతో వైశాలి నగర్లో ఆందోళన నెలకొంది. వర్షాకాలంలో నాల పనులు చేపట్టడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు బాలయ్య కుటుంబ సభ్యులు ఆ పెద్దాయన కోసం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సహాయక బృందాలు అతడి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. బాలయ్య ఆచూకీ లభించే వరకు గాలింపు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.
Also read
- అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చెయ్యాలి….పామర్తి సత్యనారాయణ, ఐ.యఫ్.టి.యు .
- ఇంకా దొరకని బాలయ్య ఆచూకీ!
- Shukra Gochar 2026: శుక్రుడి అనుగ్రహం..ఆర్థికంగా ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్..!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- నిడదవోలు నియోజకవర్గం – నిడదవోలు రూరల్ వివిధ గ్రామాలలో”రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం, ఇంటింటా తెలుగుదేశం” కార్యక్రమం*





