మేనమామ, వరుసకు సోదరులైన ఇద్దరి ఘాతుకం
కీసర: ఓ మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన కీసర పోలీస్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రకు చెందిన బాలిక (13) తల్లిదండ్రులు మృతిచెందడంతో కీసరలోని తన అమ్మమ్మ వద్ద కొన్ని సంవత్సరాలు ఉంది. స్థానికుల సహాయంతో ఇటీవల తుర్కపల్లిలోని వసతి గృహంలో చేరి ప్రస్తుతం 8వ తరగతి చదువుతోంది. ఇటీవల సెలవులు కావడంతో కీసరలోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది.
బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో మేనమామతో పాటు వరుసకు సోదరులైన ఇద్దరు యువకులు గంజాయి మత్తులో బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. అనంతరం వసతి గృహానికి వెళ్లిన బాలిక తలకు ఫ్యాన్ తగిలి గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఇంటికి రాగా ఈ విషయం తెలిసింది. దీంతో నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకోగా మరొకరు పరారీలో ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- డామిట్ కథ అడ్డం తిరిగింది
వదిన హత్యకు సుపారి - గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు
- బాలికపై సామూహిక లైంగిక దాడి
- సవతి కొడుకును సుపారీ ఇచ్చి చంపించిన సవతితల్లి
- బాలికపై లైంగికదాడి నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష





