చింతలమానెపల్లి: బ్యాటరీ ఛార్జర్తో ఆడుతుండగా.. అది ఒక్కసారి పేలడంతో ఓ బాలుడు మృత్యువాత పడ్డాడు. ఈ విషాద ఘటన కుమురంభీం జిల్లా చింతలమానెపల్లి మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై కమలాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. గూడెం గ్రామానికి చెందిన నికాడి గణేశ్-సంధ్య దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దవాడైన లోకేశ్ (13) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. బుధవారం వర్షం కారణంగా బడికి వెళ్లలేదు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న ఓ బ్యాటరీ ఛార్జర్ (9వోల్ట్)కు తీగలను అమర్చి వాటిని నోటిలో పెట్టుకున్నాడు. దీంతో ఆ బ్యాటరీ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో లోకేశ్ మొహం మొత్తం తునాతునకలైంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతిచెందాడు. అప్పటివరకు ఆడుకుంటూ.. కళ్లముందే తిరిగిన కుమారుడు విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
Also read
- ముఖ్యమంత్రి చంద్రబాబు జలవిజన్ కు ఎన్నో ప్రశంసలు
- చాక్లెట్ ఆశచూపి బాలుడి కిడ్నాప్
- రేపే వివాహం.. ఇంతలోనే కాల్వలో గల్లంతు
- అమానుషం.. అర్ధరాత్రి కదులుతున్న ఆటో నుంచి రోడ్డుపై ఏదో విసిరేశారు! దగ్గరకెళ్లి చూడగా..
- ఇన్‌స్టాలో పరిచమయ్యాడు.. తర్వాత ఇంటి నుంచి తీసుకెళ్లాడు.. కట్‌చేస్తే.. 3 నెలల తర్వాత..





