హైదరాబాద్, బంజారాహిల్స్: హత్య కేసుల్లో నిందితుడు.. 23 సంవత్సరాలుగా తప్పించుకుతిరుగుతున్నాడు. ఎట్టకేలకు బంజారాహిల్స్ పోలీసులకు శుక్రవారం చిక్కాడు. ఇన్స్పెక్టర్ ఎస్.సుహాసన్ తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్డునెంబర్-12లోని సయ్యద్ నగర్ లో నివసించే అర్షద్ అలీ(50) 2003లో బంజారాహిల్స్, నిజామాబాద్ ఐదో టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలోని రెండు హత్యకేసుల్లో నిందితుడు.
జైలుకు వెళ్లి బెయిల్ పై వచ్చిన తర్వాత వనస్థలిపురంలో ఓ చోరీ కేసులో మళ్లీ జైలుకు వెళ్లాడు. బెయిల్ పై వచ్చిన అనంతరం బెదిరింపులకు పాల్పడటంతో బంజారాహిల్స్ పోలీసే స్టేషన్ పరిధిలో ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదైంది. నిందితుడు మహారాష్ట్రకు పరారై పాలఘడ్ జిల్లా వసాయి గ్రామంలో షకీల్గా పేరు మార్చుకున్నాడు. అక్కడే రేష్మ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి పోలీసులు గాలిస్తూనే ఉన్నారు.
రౌడీషీట్ కూడా తెరిచారు. వారెంట్ కూడా పెండింగ్ లో ఉంది.కేసును సవాల్ తీసుకున్న ఇన్స్పెక్టర్ సుహాసన్, ఎస్ఐ బీ శ్రీనివాస్, ఏఎస్ఐ ముజఫర్, హెడ్ కానిస్టేబుల్ సుభాష్ తో ఓ బృందాన్ని ఏర్పాటు చేసి రెండు నెలలుగా అతడి కదలికలపై దృష్టి పెట్టారు. సాంకేతికత ఆధారంగా మహారాష్ట్రలో పట్టుకున్నారు. నిందితుడిని రిమాండ్ కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
Also read
- అయ్యో ఎంత పని చేశావ్ తల్లి.. ఉరివేసుకొని 5వ తరగతి బాలిక ఆత్మహత్య.. ఎందుకంటే?
- అయ్యో అనిత.. మరికాసేపట్లో డెలివరీ.. అంతలోనే వైద్యులు వచ్చి ఏం చెప్పారంటే..
- ఎంతకు తెగించార్రా..! రూ.30 వేల అప్పు కోసం 21 రోజుల పసికందు కిడ్నాప్..!
- Hyderabad: అంతా పక్కా స్కెచ్.. బెడిసికొట్టిన ఫ్లాన్.. ఏటీఎం చోరీ కేసులో సంచలన ట్విస్ట్!
- అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్తే.. నువ్వు చనిపోయావ్గా అన్నారు.. అసలు ఏమైందంటే..?





