కాశీబుగ్గ: వరంగల్ జిల్లా కాశీబుగ్గ దూపం సంపత్ కూడలిలోని ఓ హోటల్లో వడలో బల్లి పడిందని గురువారం కాశీబుగ్గకు చెందిన బేతి రాజు అనే వ్యక్తి ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ మౌనిక, ల్యాబ్ పరిశీలకుడు నరేశ్ కుమార్, వరంగల్ కార్పొరేషన్ శానిటరీ ఇన్స్పెక్టర్ భాస్కర్ సారథ్యంలో అధికారులు హోటల్ ను తనిఖీ చేశారు. హోటల్ నిర్వహణ సరిగా లేకపోవడంతో పాటు, సరైన పత్రాలు లేవని రూ.10 వేల జరిమానా విధించి, హోటల్ను సీజ్ చేశారు. సంబంధిత అధికారులు తెలిపిన వివరాల మేరకు.. కాశీబుగ్గకు చెందిన బేతి రాజు గురువారం స్థానికంగా ఉన్న ఓ హోటల్లో వడ పార్సిల్ తీసుకెళ్లాడు. తినడానికి పార్సిల్ విప్పి నాలుగింటిలో రెండు తిన్నాడు. మూడో వడ తినే క్రమంలో అందులో బల్లి కనిపించడంతో వెంటనే సదరు హోటల్కు వచ్చి జరిగిన విషయం చెప్పాడు. ఈ విషయమై హోటల్ నిర్వాహకులు సరైన సమాధానం ఇవ్వకుండా దురుసుగా మాట్లాడటంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ మౌనిక ఆధ్వర్యంలో మున్సిపల్ శానిటరీ విభాగం సిబ్బంది విచారణ చేపట్టి హోటల్ నిర్వాహకులపై చర్యలు తీసుకున్నారు. రాజు ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు.
Also read
- Jyeshtha Purnima: జ్యేష్ఠ పూర్ణిమ.. మీ రాశికి ఏం దానం చేయాలి? ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షంతో ధనలాభం!
- దేవాలయాల్లోని పవిత్ర జలాశయాల్లో స్నానం ఎందుకు చేయాలి? ఈ ఆధ్యాత్మిక రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- స్ట్రాబెర్రీ మూన్.. జూన్ 29 రాత్రి ఆకాశంలో అద్భుతం.. ఈ టైమ్లో చూస్తే భారీ చంద్రుడు కనిపిస్తాడు!
- నేటి జాతకములు 28 జూన్, 2026
- షకీల్గా పేరు మార్చుకుని.. 23 ఏళ్లకు చిక్కిన నేరస్తుడు
నిందితుడు అర్షద్ అలీ





