కర్నూలు జిల్లాలో తీవ్ర కలకలం రేపిన గంగమ్మ కస్టోడియల్ డెత్ కేసు రోజురోజుకూ తీవ్ర సంచంలనంగా మారుతోంది. తాజాగా కౌతాళం మండలం బదినే హాల్ గ్రామానికి చెందిన గంగమ్మ కస్టూడియల్ డెత్ , దర్గప్ప కేసుకు సంబంధించి పూర్తి ఇన్వెస్టిగేషన్ రిపోర్టుని తమకు సమర్పించాలని GP నీ హైకోర్టు ఆదేశించింది.
కర్నూలు జిల్లాలో తీవ్ర కలకలం రేపింన గంగమ్మ కేసు రోజురోజుకూ తీవ్ర సంచలనంగా మారుతుంది. తాజాగా ఈ కేసు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసుకు సంబంధించి పూర్తి ఇన్వెస్టిగేషన్ రిపోర్టును తమకు సమర్పించాలని తెలిపింది. ఈ కేసుపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై విచారణ చేపట్టిన హైకోర్టు తాజాగా ఈ ఆదేశాలను జారీ చేసింది.
ఇదిలా ఉండగా బుధవారం కౌతాళం మండలం బదినేహళ్ గ్రామానికి వెళ్లి గంగమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు వైసీపీ నేతలుమాజీ మంత్రి మేరుగ నాగార్జున, వైసిపి దళిత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ బాబు, మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కనకారావు తదితరులు. ఈ సందర్భంగా దళిత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు మరణ శాసనాలుగా, పోలీసులు నరరూప రాక్షసులుగా మారిపోయారన్నారు.
అదృశ్యమైన కొడుకు ఆచూకీ చెప్పమని వెళ్తే.. తల్లి గంగమ్మను పోలీసులు చిత్రహింసలకు గురి చేసి చంపేశారని ఆరోపించారు.కొడుకు వీరేంద్రను చంపింది మేమే అని ఒప్పుకోవాలని గంగమ్మ, దర్గప్పను మానసికంగా శారీరకంగా చిత్రహింసలకు గురిచేశారని.. గంగమ్మ నిజంగా నేరం చేసి ఉంటే కోర్టుకి ఎందుకు సమర్పించలేదని ప్రశ్నించారు. గంగమ్మను పోలీసులు చంపేసి 200 మంది పోలీసులతో బంధువులకు కడచూపు కూడా లేకుండా రహస్యంగా పాతిపెట్టి వెళ్ళిపోయారని ఆరోపించారు.
ఇక మాజీమంత్రి నాగార్జున మాట్లాడుతూ.. కొడుకు కనిపించలేదని ఫిర్యాదు చేసిన తల్లిని పోలీసులు కొట్టి చంపితే ఎస్సీ కమిషన్ స్పందించదా? అని ప్రశ్నించారు. గంగమ్మ మృతిపై జ్యుడీషియల్ లేదా సిబిఐ విచారణ జరిపించాలి డిమాండ్ చేశారు.
Also read
- Hyderabad: అతన్ని గుడ్డిగా నమ్మింది.. హోటల్‌కు వెళ్లింది.. కట్‌చేస్తే.. అసలు మ్యాటర్ తెలిసి..
- అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం- ప్రొద్దుటూరులో అరుదైన నవగ్రహ మండపం విశేషాలివే!
- తల్లి మృతిని తట్టుకోలేక.. భార్యను చంపి భర్త ఆత్మహత్య
- లాయర్ అయితే నాకేంటి.. చంపకుండా ఇక్కడి నుంచి వెళ్లను!’
- రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ డీసీపీ కుమార్తె మృతి




