హైదరాబాద్: మ్యాట్రిమోని సైట్లలో రిజిస్టర్ చేసుకుని.. యువతులను రూ.కోట్లలో మోసం చేస్తున్న వెంకట కామేష్ కేసులో బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. పోలీసుల దర్యాప్తులో అతని అరాచకాలు ఒక్కోటిగా వెలుగులోకి వస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరానికి చెందిన వెంకట కామేష్పా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 18 కేసులు నమోదయ్యాయి. మోసపోయిన వారంతా ఐటీ ఉద్యోగులే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రూ.200 కోట్ల సంపన్నుడిగా నమ్మించి యువతుల నుంచి డబ్బులు వసూలు చేసిన కామేష్.. బెట్టింగ్, గేమింగ్ ఆడుతున్నాడని చెప్పారు. ఫామ్ హౌస్ పని వాళ్లకు డబ్బులు ఇచ్చి యజమానిగా చెప్పుకొనేవాడని తెలిపారు. ఇటీవల ఓ యువతి ఫిర్యాదుతో కామేష్ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయగా.. పీటీ వారెంట్పై మచిలీపట్నం పోలీసులు అతడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే తమని సంప్రదించాలని.. నిందితుడిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తామని సైబరాబాద్ సైబర్ క్రైం డీసీపీ సాయి మనోహార్ తెలిపారు.
Also read
- Weekly Horoscope: ఈ వారం వారి జాతకం మారబోతోంది… ఆ రాశులకు ఉద్యోగం, పెళ్లి యోగం!
- Chaturmasya Deeksha: చాతుర్మాస్యం అంటే ఏమిటి? విష్ణు యోగనిద్ర వెనుక రహస్యం తెలుసా..?
- Fasting Secrets: ఉపవాసాల సమయంలో సాధారణ ఉప్పు కాకుండా సైంధవ లవణమే ఎందుకు వాడతారో తెలుసా?
- నేటి జాతకములు 26 జూలై, 2026
- కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం – రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం..ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!





