ఆదోని అర్బన్: వివాహేతర సంబంధానికి అడొస్తున్నాడన్న
నెపంతో భర్తను భార్య గొంతు నులిమి చంపేసిన ఘటన కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని అమరావతినగర్లో శనివారం వెలుగుచూసింది. ఆదోని వన్డేన్ సీఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల మేరకు.. అమరావతి నగర్‌కు చెందిన నల్లబోతుల మహేష్(28), బళ్లారి ఈరమ్మ ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ఈరమ్మ వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని తెలుసుకుని మహేష్ మద్యం సేవించి గొడవ పడేవాడు. దీంతో వివాహేతర సంబంధానికి అడ్డస్తున్నాడని భావించిన ఈరమ్మ పొలానికి తీసుకెళ్లి మహేష్ గొంతు నులిమి హత్య చేసినట్టు సీఐ తెలిపారు. మృతుడు అక్క చిట్టెమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.
Also read
- గన్నేరు ఆకులతో పప్పు వంట! అంగన్వాడీలో ఫుడ్ పాయిజన్.. ముగ్గురు చిన్నారులు, ఇద్దరు తల్లులకు అస్వస్థత
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- శ్రీకృష్ణుడిని ‘జగద్గురువు’ అని ఎందుకు అంటారు? గీతాబోధలో దాగిన జీవన సత్యాలివే
- శ్రీ కృష్ణ జన్మాష్టమి 2026: తేదీ, శుభ ముహూర్తం, పూజ విధానం, ఉపవాసం మరియు దహీ హండి(ఉట్ల పండుగ) ప్రాముఖ్యత
- Andhra: దొంగతనానికి వచ్చాడు.. వెంకటేశ్వర స్వామి ఫోటో కనపడగానే..





