SGSTV NEWS online
Andhra PradeshCrime

బంగారం కోసం పెద్దమ్మనే చంపేసింది..!



అనకాపల్లి పట్టణం: అనకాపల్లి జిల్లా కశింకోటలో దారుణం చోటుచేసుకుంది. బంగారం కోసం ఓ మహిళ పెద్దమ్మనే చంపేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కశింకోటలో నివాసముంటున్న వృద్ధురాలు దమ్ము నాగమ్మ (85) ఈనెల 16న మృతిచెందింది. సీఐ స్వామినాయుడు ఆధ్వర్యంలో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

16న రాత్రి నాగమ్మ ఇంటికి ఆమె సోదరి కుమార్తె సిమ్మ సత్య వచ్చింది. ఆమెకు అప్పుల బాధ ఎక్కువగా ఉంది. దీంతో వాటిని తీర్చేందుకు ఇంట్లో ఒంటరిగా ఉంటున్న పెద్దమ్మ నాగమ్మను బంగారు వస్తువులు తాకట్టు పెట్టుకునేందుకు అడిగింది. దీనికి ఆమె నిరాకరించడంతో చున్నీతో గొంతు నులిమి హత్య చేసింది. మరుసటి రోజు ఇంటికి వచ్చి బంగారు వస్తువులు కాజేసింది. ఈ ఘటనలో ఎవరికీ అనుమానం రాకుండా సత్య వ్యవహరించింది. చివరికి పోలీసుల విచారణలో తానే హత్య చేసినట్లు ఒప్పుకోవడంతో ఆమెను అరెస్ట్ చేశారు. నాగమ్మ ఇంట్లో కాజేసిన బంగారు వస్తువులను నిందితురాలి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Also read

Related posts