గరుడ పురాణం మరణానికి సంబంధించి అనేక విషయాలను తెలియజేస్తుంది. అయితే మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక వ్యక్తి మరణిస్తే, సాయంత్రం 6లోపే అంత్యక్రియలు నిర్వహిస్తారు. సూర్యాస్తమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అంత్యక్రియలు జరపరు? మరి ఎందుకు ఇలా? అసలు రాత్రి సమయంలో శవాన్ని ఎందుకు దహనం చేయరూ ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

ఇక గరుడ పురాణంలో మరణించడం, అంత్యక్రియల గురించి చాలా వివరంగా తెలియజేయడం జరిగింది. మనిషి చనిపోవడం, చనిపోయిన తర్వాత చేసే నియమ నియబంధనల గురించి తెలియజేశారు. అసలు ఒక మనిషి చనిపోయిన తర్వాత ఎందుకు నియమ నిష్టలతో దహన సంస్కారాలు జరుపుతారో కూడా వివరించడం జరిగింది. ముఖ్యంగా చాలా వరకు ఒక వ్యక్తి చనిపోతే సూర్యాస్తమయం అయ్యింది అంటే చాలు, తనకు అంత్యక్రియలు జరపరు. మరి దీని గురించి గరుడ పురాణం ఏం చెబుతోంది అంటే?
గరుడ పురాణం శరీరం తాత్కాలికమైనది, కానీ, ఆత్మ అనేది ఎప్పటికీ శాశ్వతమైనది అని తెలియజేస్తుంది. హిందూ ధర్మ శాస్త్రాల్లో కూడా ఆత్మ, పుట్టుక, చావుల గురించి తెలియజేయడం జరిగింది. అయితే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత తప్పకుండా నియమ నింబధనల ప్రకారం అంత్యక్రియలు జరపాలంట. ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో సూర్యాస్తమయం అయిన తర్వాత దహనం చేయడం మంచిది కాదు అని గరుడ పురాణం తెలియజేస్తుంది.
గరుడ పురాణం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత దహన సంస్కారాలు చేయడం అశుభకరం. సూర్యుడి వెలుగు సానుకూల శక్తికి నిదర్శనం, సూర్యుడి సమక్షంలో అంత్యక్రియలు జరిపితేనే, ఆత్మకు దేవతల ఆశీస్సులు లభిస్తాయంట, లేకపోతే ఆ వ్యక్తికి స్వర్గలోక ప్రాప్తి లభించదు, రాత్రి సమయంలో దహన సంస్కారాలు నిర్వహిస్తే ప్రతికూల శక్తులు, అసుర శక్తుల ప్రభావం ఆత్మపై ఉంటుందట. దీంతో ఆత్మ పిచాచ రూపం ధరించే అవకాశం ఎక్కువగా ఉంటుందంట.
సైన్స్ పరంగా చూస్తే, పూర్వం సరిగ్గా వెలుతురు ఉండేది కాదు, అందుకోసమే రాత్రి సమయంలో దహన కార్యక్రమాలు చేయకూడదు అని చెప్పేవారు. చీకటి కరెంట్ లేకపోవడం, శశ్మాన వాటికలు ఊరి బయట ఉండటం వలన అంత్యక్రియలు నిర్వహించడం ప్రమాదంతో కూడిన పని అయ్యేది. అందుకే వెలుతురు ఉన్నప్పుడే అంత్యక్రియలు జరిపేవారంట. అదే అనవాయితీగా కొనసాగుతుంది.
పుట్టిన ప్రతి వ్యక్తి మరణించడం అనేది సహజం. అందుకే అంటారు పుట్టిన వారు మరణించక తప్పదు, మరణించిన వారు పుట్టక తప్పదు అని, చాలవు పుట్టుకలు అనేది కామన్. అయితే మరణించిన వారికి అంత్యక్రియలు చేయడం అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. ఎవరికి అయితే అంత్యక్రియలు శాస్త్రోత్తంగా జరుగుతాయో వారి ఆత్మకు శాంతి కలుగుతుంది. లేకపోతే ఆత్మ చాలా ఇబ్బందులు పడుతూ, భూలోకంలోనే తిరుగుతుంది అని అంటారు. అందుకే ఒక వ్యక్తి చనిపోతే తప్పకుండా 11 రోజుల పాటు పలు కార్యక్రమాలు నిర్వహించి శాస్త్రోత్తకంగా అంత్యక్రియలు జరిపిస్తారు.

