వేధింపులు భరించలేక గోదావరిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన బాలిక
ఫిర్యాదు చేసినా పట్టించుకోని నరసాపురం రూరల్ పోలీసులు
పీజీఆర్ఎస్లో పశ్చిమ గోదావరి ఇన్చార్జి కలెక్టర్‌కు బాధిత బాలిక ఫిర్యాదు
పోక్సో కేసు నమోదు చేయాలని ఆదేశం
భీమవరం(ప్రకాశం చౌక్): జనసేన పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ ఓ బాలిక (17)పై లైంగిక దాడికి ప్రయత్నించాడు. అతని ఆగడాలను భరించలేని బాలిక సోమవారం భీమవరం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో ఇన్చార్జ్ కలెక్టర్ రాహుల్‌కుమార్‌రెడ్డికి ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన ఇన్చార్జి కలెక్టర్ ఈ ఘటనపై పోక్సో కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. బాధిత బాలిక తెలిపిన వివరాల మేరకు… ‘పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలంలోని ఓ గ్రామ మాజీ సర్పంచ్, జనసేన నాయకుడు అయిన తిరుమాని వెంకటరాజు కొంతకాలం కిందట నా తల్లికి దగ్గరయ్యాడు. దీనిపై తరచూ మా ఇంట్లో గొడవలు జరుగుతుండేవి. నా తండ్రిని చంపి అడ్డు తొలగించుకోవాలని చూశారు.
నా తండ్రిపై దాడి చేసి ఇంటి నుంచి వెళ్లగొట్టారు. అప్పటి నుంచి వెంకటరాజు మా ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో వెంకటరాజు కన్ను నాపై పడింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో కోరిక తీర్చాలని అసభ్యంగా ప్రవర్తించేవాడు. ప్రతిఘటిస్తే నేను జనసేన నేతనని ఎవరూ ఏమీ చేయలేరని భయపెట్టేవాడు. ఈ నెల 7న ఇంట్లో నన్ను బంధించి వెంకటరాజు లైంగిక దాడికి ప్రయత్నించగా కేకలు వేశాను. నా తల్లి వచ్చి అతనికి సహకరించాలని చెప్పింది. వారి నుంచి తప్పించుకుని రాజులలంక వద్ద గోదావరిలో దూకి ఆత్మహత్యకు యత్నించాను.
స్నేహితులు నన్ను రక్షించి ఇంటికి తీసుకువెళ్లారు. ఇంటి తలుపులు తీయకపోవడంతో 12వ తేదీ వరకు స్నేహితుల ఇంటి వద్ద ఉన్నాను. ఆ తర్వాత మా మావయ్యకు ఈ విషయం తెలిసి వచ్చి మళ్లీ ఇంటికి తీసుకువెళ్లినా తలుపు తీయలేదు. నరసాపురం రూరల్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు. దీంతో కలెక్టరేట్‌కు వచ్చి వెంకటరాజుతోపాటు నా తల్లిపై కూడా ఫిర్యాదు చేశాను.’ అని బాధిత బాలిక విలపించింది.
Also read
- తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్య
- నూకరాజు కుటుంబానికి నరకం చూపిన సాధిక్
- సోమవారం శివుడితో పాటు చంద్రుడిని ఎందుకు పూజిస్తారు? గంగాజలంతో అభిషేకం వెనుక ఉన్న రహస్యం ఇదే!
- Indira Ekadashi: ఇందిరా ఏకాదశి రోజునే 4 శుభ యోగాలు.. ఈ పూజలు చేస్తే విశేష పుణ్యఫలాలు!
- నేటి జాతకములు 5 అక్టోబర్, 2026





