అంబికాపుర్: తాగిన మైకంలో ఓ వ్యక్తి తన భార్యను అత్యంత పాశవికంగా హింసించి హత్య చేశాడు. మూడు నెలల గర్భిణి అయిన ఆమె ప్రమాదవశాత్తూ చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. పోస్టుమార్టం చేస్తుండగా.. మృతురాలి ప్రైవేటు అవయవాల్లో తీవ్రగాయాల ఆనవాళ్లు కనిపించడంతో వైద్యులు విస్తుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగడంతో నిందితుడు పరారయ్యాడు. ఛత్తీస్ గఢ్ లో ఈ దారుణం జరిగింది. సద్గుజా జిల్లా మణిపుర్ గ్రామానికి చెందిన ప్రదీప్ ఆగారియా గర్భిణి అయిన తన భార్య హీరాబాయిపై (23) ఈ నెల 14న తీవ్రంగా దాడి చేశాడు. ఆమె ప్రయివేటు భాగంలో ఆక్సా బ్లేడు చొప్పించి చిత్రహింసలు పెట్టడంతో స్పృహ తప్పి పడిపోయింది. ఈ దంపతుల నాలుగేళ్ల కుమార్తె ఆ సమయంలో అక్కడే ఉంది. అనంతరం భార్యను మోటారు సైకిలుకు కట్టుకొని అంబికాపుర్ వైద్య కళాశాల ఆసుపత్రికి తీసుకెళ్లాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడినట్లు వైద్యులకు చెప్పాడు. హీరాబాయి మృతిచెందినట్లు వైద్యులు గుర్తించారు. తలపై కొట్టడంతో లోతైన గాయాలై ఆమె మరణించినట్లు ధ్రువీకరించారు. పోలీసులు ఆదివారం నిందితుడిని అరెస్టు చేయగా, నేరం అంగీకరించాడు.
Also read
- తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్య
- నూకరాజు కుటుంబానికి నరకం చూపిన సాధిక్
- సోమవారం శివుడితో పాటు చంద్రుడిని ఎందుకు పూజిస్తారు? గంగాజలంతో అభిషేకం వెనుక ఉన్న రహస్యం ఇదే!
- Indira Ekadashi: ఇందిరా ఏకాదశి రోజునే 4 శుభ యోగాలు.. ఈ పూజలు చేస్తే విశేష పుణ్యఫలాలు!
- నేటి జాతకములు 5 అక్టోబర్, 2026





