సికింద్రాబాద్: చిలకలగూడకు చెందిన యావన్ హత్య ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని సికింద్రాబాద్ డీసీపీ రక్షిత స్పష్టం చేశారు. అమ్మాయి కుటుంబ సభ్యులు ప్లాన్ ప్రకారం హత్య చేశారన్నారు. అమ్మాయి తండ్రి, బాబాయి, బావ, అన్న, కజిన్ బ్రదర్స్ కలిసి యావను హత్య చేసినట్లు గుర్తించామన్నారు. మే 7వ తేదీ జరిగిన ఈ హత్య కేసుకు సంబంధించి వివరాలను డీసీపీ మీడియాకు వెల్లడించారు.
మే 7 అర్ధరాత్రి యావన్ హత్య జరిగింది. ఐదు ప్రత్యేక బృందాలతో ఈ కేసు దర్యాప్తు చేసాము.. యావన్, చంద్రికలు స్కూల్ డేస్ నుండి ఫ్రెండ్స్.. గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. గతంలో అమ్మాయి కుటుంబ సభ్యులు యావన్ ను హేచ్చరించారు. హత్యకు ఐదు రోజుల ముందే హత్య కోసం నిందితులు ప్లాన్ చేసుకున్నారు. అందరూ కలిసి రెక్కి నిర్వహించారు.
A1 అల్లబోయిన సాయి కిరణ్ యువతి బావ.. ప్రధాన నిందితుడు..హత్య కు ప్లాన్ చేశారు. సాయి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ కేసులో మొత్తం 10 మందిని అరెస్ట్ చేశాం. నిందితులలో ఇద్దరికి గాంజా పాజిటివ్ వచ్చింది ఈ కేసులో మొత్తం 9 మంది నిందితులతో పాటు ఓ మైనర్ అరెస్ట్ చేశాం’ అని తెలిపారు.
Also read
- అయ్యో ఎంత పని చేశావ్ తల్లి.. ఉరివేసుకొని 5వ తరగతి బాలిక ఆత్మహత్య.. ఎందుకంటే?
- అయ్యో అనిత.. మరికాసేపట్లో డెలివరీ.. అంతలోనే వైద్యులు వచ్చి ఏం చెప్పారంటే..
- ఎంతకు తెగించార్రా..! రూ.30 వేల అప్పు కోసం 21 రోజుల పసికందు కిడ్నాప్..!
- Hyderabad: అంతా పక్కా స్కెచ్.. బెడిసికొట్టిన ఫ్లాన్.. ఏటీఎం చోరీ కేసులో సంచలన ట్విస్ట్!
- అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్తే.. నువ్వు చనిపోయావ్గా అన్నారు.. అసలు ఏమైందంటే..?





