బెంగళూరు: అనైతిక బంధానికి ఒడిగట్టిన భార్య చివరకు హత్యకూ వెనుకాడలేదు, ఫలితంగా కఠిన శిక్షకు గురైంది. అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కోపంతో హత్య చేసిన కేసులో భార్య, ఆమె ప్రియునికి శివమొగ్గ జిల్లా భద్రావతి కోర్టు మరణశిక్షతో పాటు రూ. 14 లక్షల జరిమానా విధించింది.
మత్తు మందు ఇచ్చి..
వివరాలు… 2020 జనవరి 15న, భద్రావతిలోని పేపర్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సురగీ టాప్కు చెందిన ఫ్లోరా నాన్సీ అనే మహిళ, తన ప్రియుడు రాజశేఖరయ్యతో కలిసి భర్త ప్రకాష బాబుకు మత్తుమందు ఇచ్చి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అప్పటి కేసు దర్యాప్తు అధికారి, సీఐ మంజునాథ్.. దర్యాప్తును పూర్తి చేసి కోర్టుకు ఛార్జిషీట్ సమర్పించారు.
భద్రావతిలోని 4వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో విచారణ సాగింది. ప్రభుత్వ ప్రాసిక్యూటర్ రత్నమ్మ వాదనలు వినిపించారు. ఫ్లోరా నాన్సీ, ప్రియునికి ఉరే సరైన శిక్ష అని వాదిస్తూ ఆధారాలను సమర్పించారు. నేరం రుజువు కావడంతో జడ్జి ఇందిరా మైలస్వామి చెట్టియార్.. ఇద్దరు దోషులకు ఉరిశిక్ష విధించాలని తీర్పు చెప్పడంతో పాటు రూ.14 లక్షల జరిమానా విధించారు. మృతుని తల్లిదండ్రులకు రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు.
Also read
- Rajanagaram: గోదావరిలో స్నానానికి దిగి ఇద్దరు విద్యార్థులు మృతి
- Kakinada: కాకినాడ జిల్లాలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత!
- Janwada: జన్వాడలో దంపతుల ఆత్మహత్య.. ఐదు నెలల పసిబిడ్డ అనాథ
- హైదరాబాద్ లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో.. అర్ధరాత్రి ఓ మహిళ ఎంట్రీ, ఆ తర్వాత ఏం జరిగిందంటే..
- విజయనగరంలో భారీ భూ కుంభకోణం.. MSME పార్క్ కోసం తవ్వుతుంటే వైసీపీ నేత ఘరానా స్కామ్..?





