SGSTV NEWS online
Andhra PradeshCrimeTelangana

భార్య కనిపించడం లేదంటూ ఫిర్యాదు.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ ట్విస్ట్.. హత్య చేసి పాతిపెట్టిన భర్త





నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం లోని వీరవోలు గ్రామానికి చెందిన 35 ఏళ్ల లక్ష్మి కనిపించడం లేదని ఈ నెల రెండవ తేదీన భర్త వెంకటస్వామి నందివర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. లక్ష్మీ కనిపించకపోవడంతో ఆమె బంధువులకు భర్త వెంకటస్వామి పై అనుమానం వచ్చింది. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని లక్ష్మీ బంధువులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. ఈ మేరకు బనగానపల్లె సిఐ మంజునాథ్ రెడ్డి ఎస్సై భూపాలుడు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు వాస్తవాలు వెలుగు చూశాయి.


మృతదేహం కుళ్ళిపోవడంతో ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం చేశారు. భార్యపై అనుమానం రావడంతో వెంకటస్వామి వారం రోజుల క్రితమే తన సోదరులు వెంకటరమణ శ్రీనివాసులు సహకారంతో గ్రామ సమీపంలోని గాలేరు నగరి కాల్వ వద్దకు తీసుకెళ్లి అక్కడే చంపి పూర్తి పెట్టినట్లు పోలీసులు తెలిపారు అయితే ఇదేమీ తెలియనట్లు నటించి భార్య కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేయడం అనేక అనుమానాలకు తావిచ్చింది. హత్య చేసి.. కనిపించడం లేదంటూ నటించిన వెంకటస్వామి తో పాటు అతని సోదరులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇంకా అనేక విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది.

Also read

Related posts