పథకం ప్రకారం కట్టుకున్న భార్యని కత్తితో అతికిరాతకంగా హత్య చేసిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో చోటుచేసుకుంది.
సూర్యాపేట జిల్లా: పథకం ప్రకారం
కట్టుకున్న భార్యని కత్తితో అతికిరాతకంగా హత్య చేసిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన బత్తుల శిరీష(24)కు, కోదాడలోని బాబునగర్కు చెందిన మణిదీప్ తో 6 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. ప్రస్తుతం వీరు కోదాడలోనే నివాసం ఉంటున్నారు. వీరికి మూడేళ్ల బాబు ఉన్నాడు. గత 15 రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమెను హత్య చేసినట్లు సమాచారం. మృతురాలి పెద్దమ్మ తురక వెంకమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ శివశంకర్ తెలిపారు. పట్టణం నడిబొడ్డున హత్య జరగడంతో ఒక్కసారిగా ప్రజానీకం భయభ్రాంతులకు గురయ్యారు
Also read
- డాక్టర్ ప్రియాంక మరణంపై హత్య కేసుగా నమోదు చెయ్యాలి KVPS డిమాండ్
- యూనియన్ బ్యాంక్లో అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన ఫైళ్లు
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ఉదయం పరిచయం.. మధ్యాహ్నం పెళ్లి.. రాత్రికి శోభనం అంటే పరిగెత్తిన వరుడు.. తీరా చూస్తే..!
- రీ సర్వే మహిళా ప్రాణం తీసిందా! కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత





