వైఎస్సార్ జిల్లా: ప్రొద్దుటూరులో వివాహిత పద్మజ
అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. కేసు వివరాలను ఏఎస్పీ విభుకృష్ణ మీడియాకు వెల్లడించారు. భర్త కిరణ్‌కుమార్.. పాలకోవలో విషం కలిపి హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు. కిరణ్‌కుమార్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. మీడియా ఎదుట హాజరుపరిచారు.
భర్త కిరణ్.. భార్య హత్యకు యూట్యూబ్‌లో శోధించి ప్లాన్ వేశాడు. హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరుకు కొరియర్ ద్వారా విషం తెప్పించిన భర్త.. పాలకోవాలో విషం కలిపి భార్యకు తినిపించడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. భార్య చనిపోయిందో లేదో అనుమానంతో భర్త కిరణ్.. ఆమె ముఖంపై దిండుతో నొక్కినట్లు ఏఎస్పీ వెల్లడించారు. భార్య లావుగా ఉండటం, తనను నిత్యం అనుమానిస్తోందన్న కారణంతోనే కిరణ్ హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు.
Also read
- గంగాజలంతో శివయ్యకు అభిషేకం- వందల కిలోమీటర్లు సాగే పవిత్ర కన్వర్ యాత్ర విశిష్టత తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ఐ.యఫ్.టి.యు కార్యవర్గం ఏకగ్రీవం..
- పోలీసుల ఎదుటే గొంతు కోసుకుని..
- ఇంజినీరింగ్ విద్యార్థిని అదృశ్యం




