SGSTV NEWS online
Business

SIM Validity: రీఛార్జ్ చేయకుండా.. సిమ్ను ఎన్ని రోజులు యాక్టివ్ గా ఉంచుకోవచ్చో తెలుసా?



SIM Validity: ఒక అప్పుడు మొబైల్ నెంబర్ ఒక్క  కాల్స్ కు మాత్రమే పరిమితమై ఉండేవి. కానీ ప్రస్తుత రోజుల్లో ఫోన్ నెంబర్ ఎన్నో పనులతో ముడిపడి పోయింది. బ్యాంకింగ్ అవసరాలు, ఆధార్ వెరిఫికేషన్, ఓటీపీలు ఇలా ప్రతీ ఒక్కటీ మొబైల్ నెంబర్ పై ఆధారపడుతున్నాయి. ఒకవేళ మొబైల్ నెంబర్ డీయాక్టివేట్ అయితే ఇవన్నీ ఆగిపోయే ప్రమాదముంది. దీనిని గమనించిన టెలికాం సంస్థలు తప్పనిసరిగా ఏదోక ప్లాన్ రీఛార్జ్ చేసుకోవాలని యూజర్లపై ఒత్తిడి చేస్తున్నాయి. లేదంటే సిమ్ డీయాక్టివేట్ చేస్తామంటూ పరోక్షంగా బెదిరిస్తున్నాయి. అసలు ట్రాయ్ నిబంధనల ప్రకారం రీఛార్జ్ చేసుకోకుండా సిమ్ ను ఎన్నిరోజులు యాక్టివ్ గా ఉంచవచ్చో ఈ కథనంలో పరిశీలిద్దాం.

నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?


టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) నిబంధనల ప్రకారం సిమ్ కార్డ్ యాక్టివ్ గా ఉండాలంటే రీఛార్జ్ తప్పనిసరి. ఒక వ్యక్తి సిమ్ కార్డును ఎక్కువ రోజుల పాటు రీఛార్జ్ చేయకుండా ఉండే దానిని డీయాక్టివేట్ చేసే అధికారం టెలికాం రంగ సంస్థలకు ఉంది. అయితే ట్రాయ్ రూల్స్ ప్రకారం ఒక ప్రీపెయిడ్ సిమ్ కార్డు 90 రోజుల పాటు యాక్టివ్ గా లేకపోతే.. టెలికాం రంగ సంస్థలు చర్యలకు ఉపక్రమించవచ్చు. రూ.20 కట్.. 30 రోజులు పొడగింపు

ఒకవేళ సిమ్ లో బ్యాలెన్స్ ఉంటే రూ.20 కట్ చేసుకొని వ్యాలిడిటీని మరో 30 రోజులకు టెలికాం సంస్థలు పొడిగిస్తాయి. అలా కాకుండా రూ.20 కంటే తక్కువ బ్యాలెన్స్ ఉంటే తాత్కాలికంగా డీయాక్టివేట్ చేస్తారు. అనంతరం 15 రోజుల గ్రేస్ పీరియడ్ లో యాక్టివేట్ చేసుకోకపోతే.. మొబైల్ నెంబర్ ను శాశ్వతంగా బ్లాక్ చేసే అవకాశముందని టెలికాం నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దశలవారీగా సేవలు నిలిపివేత

అయితే ఈ డీయాక్టివేట్ ప్రక్రియను దశలవారీగా టెలికాం రంగ సంస్థలు అమలు చేస్తాయి. రీఛార్జ్ ప్లాన్ గడువు ముగియగానే ముందుగా అవుట్ గోయింగ్ కాల్స్, ఎస్ఎంఎస్ లను నిలిపివేస్తాయి. అయితే ట్రాయ్ నిబంధనల ప్రకారం 90 రోజుల వరకూ ఇన్ కమింగ్ కాల్స్, ఓటీపీ వెరిఫికేషన్ కోసం ఓటీపీలు యథావిధిగా వస్తుంటాయి. నిర్దేశిత గడువు పూర్తయిన తర్వాత ఇన్ కమింగ్ కాల్స్ తో పాటు, ఓటీపీ రావడాన్ని టెలికాం సంస్థలు నిలిపివేస్తాయి. ఒకసారి సిమ్ పూర్తిగా డీయాక్టివేట్ అయితే.. ఆ నెంబర్ ను కొంత కాలం తర్వాత వేరే కొత్త కస్టమర్ కు టెలికాం సంస్థలు కేటాయిస్తాయి.

టెలికాలం ఆపరేటర్ల టైమ్ లిమిట్

ప్రస్తుతం దేశంలో జియో, ఎయిర్ టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ సంస్థలు.. టెలికాం సేవలను అందిస్తున్నాయి. జియో, ఎయిర్ టెల్, వీఐ.. సిమ్ యాక్టివ్ గా లేని కాలాన్ని 90 రోజులుగా నిర్ణయించాయి. ఈలోపు రీఛార్జ్ చేసుకోపోతే నిర్దాక్షణ్యంగా సిమ్ ను డీయాక్టివేట్ చేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ మాత్రం.. 165 రోజుల పాటు ఏ ప్లాన్ లేకున్నా ఇన్ కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్ లకు అనుమతిస్తున్నట్లు తెలియజేశారు.

Also read

Related posts