అసలే వేసవికాలం.. ఎండలు మండిపోతున్నాయి.. ఉక్క పోత ఒక్కరి బిక్కిరి చేస్తోంది.. బయటకు రావాలంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు.. మాడుపగిలే ఎండ గొంతు మార్చేస్తుంది.. దాహంతో గొంతు ఎండిపోతుంది.. ఆ సమయంలో చుక్క నీరు గొంతులో దిగితే ఆ హాయే వేరు.. అదే మండుటెండలో రోడ్డుపై ప్రయాణిస్తూ ఎక్కడ చుక్క నీరు లేని చోట ఒక బోరు కనిపిస్తే… అక్కడ ఆగి దాహం తీర్చుకోవడం గ్రామీణ ప్రాంతాల్లో సహజంగా కనిపిస్తూ ఉంటుంది. అటువంటి చోట ఉన్న బోరుకే తాళం వేస్తే..?!
ఎస్.. ఇదే జరిగింది అల్లూరి ఏజెన్సీలో.. కేవలం బాటసారులు, వాహనదారులే కాదు.. ఆ గ్రామంలోని ప్రజలకు కూడా ఇప్పుడు గొంతు ఎండిపోతోంది. ఓ వర్గం ఆదిపత్యం కారణంగా అక్కడ ప్రజలు దాహంతో అల్లాడిపోతున్నారు. ఉన్న తాగునీటి బోరుకు తాళాలు పడడంతో.. ఇక ఎవరికి చెప్పుకోవాలో తమ సమస్య తెలియక తలలు పట్టుకుంటున్నారు.
వివరాల్లోకి వెళితే.. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లంబసింగి పంచాయతీ బురడ వీధి. ఆ గ్రామంలో.. భూ వివాదాలు ఉన్నాయి. కొంతకాలంగా రెండు వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఒక వర్గం మరో వర్గం పై ఆదిపత్యం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. వాళ్లను ఎలా ఇబ్బంది పెట్టాలా అనేది అనుకుంది ప్రత్యర్థి వర్గం. దీంతో.. ఎలాగైనా కక్ష తీర్చుకోవాలని అనుకొని.. అక్కడ గ్రామస్తులకు దాహం తీర్చే బోరుపై ప్రతాపం చూపారు. బోరుకు ఐరన్ గొలుసు పెట్టి తాళం వేసేశారు. దీంతో ఆ గ్రామానికి తాగునీటి సమస్య మొదలైంది. సమస్యను లంబసింగి పంచాయతీ కార్యదర్శి దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లారు. ఆమె వచ్చి బోర్ కు వేసిన తాళం తీయించారు. సమస్య పరిష్కారమైందని ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. మళ్లీ సమస్య మొదటికి వచ్చింది. వెంటనే మళ్ళీ ఆ బోరుకు తాళం పడింది. దీంతో అధికారుల ద్వారా విషయం పోలీసులకు చేరింది.
Also read
- May 2026 Horoscope: వారికి పదోన్నతులు, కొత్త ఉద్యోగ అవకాశాలు.. మీ రాశి మాసఫలాలు
- ఆ ఊరి VRO మూతి పళ్ళు రాలగొట్టిన ఆకతాయిలు.. మద్యం మత్తులో బరితెగింపు
- దేవుడి దగ్గరికి వెళ్లి వస్తూ… ఏకంగా పై లోకాలకు.. ముగ్గరూ అక్కడే..
- మనుషుల మధ్య కక్ష.. బోరుకు తాళం! అల్లూరి జిల్లాలో నీటి చుక్కపై ఆధిపత్య పోరు
- రేణుక ఏడాదిన్నరలో ముగ్గురిని మార్చింది.. పైగా ప్రైవేట్ వీడియోలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న భర్త లెటర్..





