హైదరాబాద్‌లో సంచలనం రేపిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సీతారాం ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగుచూశాయి. భార్య రేణుక ముగ్గురితో వివాహేతర సంబంధాలు, ప్రైవేట్ వీడియోలు బయటపడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన సీతారాం 19 పేజీల సూసైడ్ నోట్ రాసి ట్యాంక్‌బండ్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో రేణుకతో పాటు ఆమె ఇద్దరు ప్రియులను పోలీసులు అరెస్ట్ చేశారు.
‘‘నా భార్య రేణుకకు ఏలోటు రాకుండా చూసుకున్నా.. కానీ.. ఆమె ఏడాదిన్నరలోనే ముగ్గురితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. అంతేకాకుండా.. ప్రైవేట్ వీడియోలను రికార్డు చేసుకోగా.. ఓ లవర్ దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఆ దారుణాలను చూసి నేను ఎలా తట్టుకోగలగాలి.. అసలు రేణుకకు అసలు ఏం కావాలి.. ప్రేమ నా లేక శృంగారమా..? ’’ అంటూ ఓ భర్త.. ఏకంగా 19 పేజీల సూసైడ్ నోట్ రాసి.. ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య అరాచకాలకు మరో భర్త బలైపోయిన సంఘటన హైదరాబాద్ నగరంలో సంచలనంగా మారింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సీతారాం ఆ లేఖలో ప్రస్తావించిన విషయాలు సంచలనంగా మారాయి.. ఏ అమ్మాయి కూడా అలా చేయవద్దంటూ సీతారాం తన వేదనను లేఖ రూపంలో పంచుకున్నాడు. ఏపీలోని మార్కాపురానికి చెందిన సీతారాం, నంద్యాలకు చెందిన రేణుకకు 2018లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాచుపల్లిలో నివాసం ఉండేవారు.. ఈ క్రమంలోనే.. భార్య వివాహేతర సంబంధాలు బయటపడటం, ఇన్‌స్టాలో వీడియోలు బయటపడటంతో ఫిబ్రవరిలో ట్యాంక్‌బండ్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
అయితే.. సీతారాం తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా సంచలన విషయాలు వెలుగుచూశాయి. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సీతారాం రాసిన 19 పేజీల సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్నారు.
తన భార్య వివాహేతర సంబంధాలే తన చావుకు కారణం అంటూ సీతారాం లేఖలో ప్రస్తావించాడు.. 19 పేజీల్లో రేణుక వివాహేతర సంబంధాలపై పూర్తి విషయాలు రాశాడు.. రేణుక ముగ్గురితో వివాహేతర సంబంధం పెట్టుకుందని.. ఏడాదిన్నరలోనే ముగ్గురితో వివాహేతర సంబంధం నడిపిందని తెలిపాడు. ఒకరితో ప్రైవేట్‌గా ఉన్న సమయంలో ఆ వీడియోలను రికార్డ్ చేసిందని తెలిపాడు..
‘‘ఒక అమ్మాయి ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేయడం ఏంటి? రమణ అనే వ్యక్తి ఆ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.. అవి చూసి నేను ఎలా తట్టుకోవాలి? అవి చూశాకే తెలిసింది నా భార్య నిజస్వరూపం.. నా భార్యకు ఏలోటు రాకుండా చూసుకున్నా.. కానీ ఆమె నాకు నమ్మక ద్రోహం చేసింది’’.. అంటూ సూసైడ్ లెటర్‌లో సీతారాం ఆవేదన వ్యక్తంచేశాడు.. తాను ఇంట్లో లేని సమయంలో రమణ పలుమార్లు ఇంటికి వచ్చి రేణుకతో గడిపాడని.. అసలు రేణుకకు ఏం కావాలి.. అంటూ ఆ లేఖలో ప్రశ్నించాడు సీతారాం..
కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సీతారాం రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ సూసైడ్ కేసులో ఇప్పటికే ముగ్గురు అరెస్టయ్యారు. రేణుకతో పాటు ఆమె ఇద్దరు లవర్స్ రమణారెడ్డి, శ్రవణ్ అరెస్ట్ అయినట్లు పోలీసులు తెలిపారు.
Also read
- May 2026 Horoscope: వారికి పదోన్నతులు, కొత్త ఉద్యోగ అవకాశాలు.. మీ రాశి మాసఫలాలు
- ఆ ఊరి VRO మూతి పళ్ళు రాలగొట్టిన ఆకతాయిలు.. మద్యం మత్తులో బరితెగింపు
- దేవుడి దగ్గరికి వెళ్లి వస్తూ… ఏకంగా పై లోకాలకు.. ముగ్గరూ అక్కడే..
- మనుషుల మధ్య కక్ష.. బోరుకు తాళం! అల్లూరి జిల్లాలో నీటి చుక్కపై ఆధిపత్య పోరు
- రేణుక ఏడాదిన్నరలో ముగ్గురిని మార్చింది.. పైగా ప్రైవేట్ వీడియోలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న భర్త లెటర్..





