అనంతపురంలో మరో వలపువల..పల్నాడు జిల్లా వాసి కి ఇన్‌స్టాగ్రామ్‌లో వల వేసి దోపిడి…సీన్ మములుగాలేదు బాబోయ్!*
గుత్తి టౌన్‌కు రావాలంటూ పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన యువకుడికి ఇన్‌స్టాగ్రామ్‌లో కర్నూలు జిల్లా జొన్నగిరికి చెందిన యువతి వలపు వల వేసింది. ఈ క్రమంలో ఆ యువకుడు గుత్తి టౌన్‌కు చేరుకున్నాడు. ఈ సమయంలో యువకుడిని నిర్మానుష్య ప్రదేశానికి యువతి తీసుకెళ్లింది. చీకట్లో ఆ యువకుడిపై దాడికి పాల్పడి డబ్బు, బంగారం, సెల్‌ఫోన్‌ను యువతి గ్యాంగ్ లాక్కొంది.
దాడి నుంచి తప్పించుకుని సమీపంలో ఓ దాబా వద్దకు పరిగెత్తుకుంటూ బాధిత యువకుడు వెళ్లాడు. ఈ దాడి ఘటన గురించి పోలీసుల దృష్టికి తీసుకెళ్లేందుకు యత్నించాడు ఆ యువకుడు.
ఇంతలో అక్కడికి చేరుకున్న యువతి గ్యాంగ్.. పోలీసుల సమక్షంలోనే మరోసారి దాడికి పాల్పడింది. దాడి చేసిన వ్యక్తులు ఓ రాజకీయ పార్టీ నాయకుడికి సన్నిహితులమని బెదిరించారు.
దీంతో కేసు వద్దంటూ బాధిత యువకుడు పోలీసులను వేడుకున్నాడు. దీంతో యువతిని గ్యాంగ్‌ను వదిలిపెట్టారు పెద్దవడగూరు పోలీసులు.
Also read
- నేటి జాతకములు 10 సెప్టెంబర్, 2026
- Hyderabad: ఇంట్లో గడియ పెట్టుకుని బయటకు రాని లేడీ డాక్టర్.. తొంగి చూసి అంతా షాక్!
- కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పాపం పెళ్లైన 6 రోజులకే వరుడు..
- పగలు భక్తులు.. రాత్రయితే దొంగలు.. దేవుడి సొమ్ము ఎలా దోచుకుంటున్నారో తెలుసా..?
- కారు కొనిచ్చి, రూ. 40 లక్షలు ఆర్థిక సహాయం.. ప్రియుడి చేసిన పనికి సాఫ్ట్వేర్ యువతి షాకింగ్ నిర్ణయం!





