SGSTV NEWS online
CrimeTelangana

అమ్మను చంపి.. ఆపై ఉరివేసి..



మద్యానికి రూ.100 ఇవ్వలేదని కొడుకు ఘాతుకం

పోలీసుల అదుపులో నిందితుడు

తాండూరు రూరల్: మద్యం తాగేందుకు రూ.100 ఇవ్వలేదని ఆగ్రహానికి లోనైన కొడుకు కర్రతో కన్నతల్లిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన తల్లి మృతిచెందడంతో, ఆమె శవాన్ని దూలానికి వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కరన్కోట్ ఎస్ఐ వినోద్ వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం ఎల్మకన్నె గ్రామానికి చెందిన రుకియాబేగం (50)కు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. అందరికీ వివాహాలు అయ్యాయి. రుకియాబేగం తాండూరు పట్టణంలోని ఓ హోటల్లో కూలి పనులు చేస్తూ జీవిస్తోంది.

పెద్ద కుమారుడు మహబూబ్ సెంట్రింగ్ పనిచేస్తుంటాడు. మద్యానికి బానిసైన ఇతను ఆదివారం రాత్రి 9 గంటలకు గ్రామంలోని తల్లి వద్దకు వెళ్లి రూ.100 ఇవ్వమని అడిగాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో ఆగ్రహంతో తల, మెడ భాగంలో విచక్షణా రహితంగా కర్రతో దాడి చేశాడు. దీంతో రుకియాబేగం అక్కడికక్కడే మృతిచెందింది.

తనపై కేసు అవుతుందని భయపడిన నిందితుడు ఓ చీర తీసుకుని తల్లి మెడకు కట్టి ఇంట్లోని దూలానికి వేలాడదీశాడు. సోమవారం ఉదయాన్నే తన తల్లి ఆత్మహత్య చేసుకుందని గ్రామస్తులు, బంధువులకు చెప్పాడు. సోదరి మునీరాబేగం వచ్చి పరిశీలించగా తల్లి ఒంటిపై గాయాలు కనిపించడంతో బంధువుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారిస్తున్నారు.

Also read

Related posts