తిరుమల శ్రీవారి దర్శనం చేయిస్తామంటూ భక్తులను మోసగిస్తున్న మరో దళారీని పోలీసులు అరెస్టు చేశారు. టీటీడీ బోర్డు మెంబర్ నకిలీ సిఫార్సు లెటర్లతో మోసానికి పాల్పడ్డ నిందితుడి బండారాన్ని పోలీసులు బయటపెట్టారు. శ్రీవారి బ్రేక్ దర్శనం ఇప్పిస్తామనని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అనిత కుటుంబ సభ్యులను మోసగించాడు చాగంటి నవీన్ కుమార్. విషయం బయటపడటంతో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మొత్తం 12 మందికి దర్శనం టిక్కెట్లు ఇప్పిస్తానని మోసం చేసిన నిందితుడు ఒక్కొక్కరికి రూ 3 వేలు చొప్పున రూ. 36 వేలు వసూలు చేశాడు. గత ఏడాది అక్టోబర్ 24న నవీన్ కుమార్ ఇచ్చిన లెటర్ల తో తిరుమలకు వచ్చిన అనిత దర్శనం కోసం ప్రయత్నించింది. అయితే ఆ లెటర్లు నకిలీవని అధికారులను సంప్రదించిన తర్వాత తెలిసింది. దీంతో తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అనిత ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు దళారీ బండారాన్ని బయట పెట్టారు.
జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, TTD CVSO మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం నిందితుడిని తిరుమలలో అరెస్ట్ చేసింది. విచారణలో రూ. 36 వేలు వసూలు చేసి నకిలీ సిఫార్సు లెటర్లు పంపించినట్లు తేలింది. నేరాన్ని అంగీకరించిన నవీన్ కుమార్ నుంచి పోలీసులు మొబైల్ ఫోన్, రూ 36 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. TTD బోర్డు మెంబర్ సిఫార్సు లెటర్‌ను డౌన్లోడ్ చేసి, నకిలీ లెటర్లు తయారు చేసి వాట్సాప్ లో పంపిన నిందితుడు అనిత ఫ్యామిలీ ని మోసగించినట్లు గుర్తించారు. ఈ మేరకు నిందితున్ని రిమాండ్ కు తరలించారు
భక్తులకు పోలీసుల విజ్ఞప్తి..
తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు కేవలం అధికారిక మార్గాల ద్వారానే పొందాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. సోషల్ మీడియా లో వ్యక్తుల ద్వారా వచ్చే హామీలను నమ్మి డబ్బులు చెల్లించ కూడదని పోలీసులు కోరుతున్నారు. అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినట్లయితే వెంటనే పోలీసులకు, టీటీడీ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. ఇలా శ్రీవారి భక్తుల విశ్వాసాన్ని దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఎస్పీ సుబ్బారాయుడు. శ్రీవారి దర్శనం, వసతి పేరుతో మోసాలకు పాల్పడే వారిపై నిరంతరం నిఘా ఉందన్నారు. అలాంటి వారిపై చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామన్నారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు.
Also read
- Telangana: ఇంతకాలం టైంపాస్‌కి లవ్ చేశావా..? అమ్మాయి చెప్పిన ఆ ఒక్క మాటతో..
- మామిళ్ళగూడెం మృత్యుఘోష.. నిన్న తండ్రి, కూతురు.. నేడు తల్లి.. ఆ ఇంట్లో ఏం జరిగింది?
- స్క్రీన్ ప్లే అదిరింది కానీ.. సీన్ మార్చేసిన క్యూఆర్ కోడ్! చండ్రుపట్ల కాలువ మృతదేహం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్!
- నకిలీ రికమండేషన్ లెటర్స్ కలకలం.. తిరుమలలో అడ్డంగా దొరికిపోయిన మోసగాడు..!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





