నిడదవోలు లో స్ధానిక కాపు కళ్యాణ మంటపం వద్ద నిర్వహించిన ఐ.యఫ్.టి.యు అనుబంధ ఆదర్శ ప్లాట్ ఫారం రిక్షా వర్కర్స్ యూనియన్ సమావేశం యూనియన్ ప్రెసిడెంట్ కోనేటి మల్లేశ్వర రావు అధ్యక్షతన నిర్వహించడమైనది.
ఈ సందర్భంగా యూనియన్ గౌరవాధ్యక్షులు పిచ్చా సూర్య కిరణ్, ఇఫ్టు రాష్ట్ర కమిటీ సభ్యులు ఈమని గ్రీష్మ కుమార్ లు మాట్లాడుతూ దశాబ్దాల క్రితం బ్రిటిష్ కాలం నుంచి అమలులో ఉన్న కార్మిక చట్టాలను కేంద్రం లోని మోడి ప్రభుత్వం బహుళ జాతి కంపెనీలకు అనుకూలంగా మార్చివేసిందనీ, రాతి యుగం నాటి 12 గంటల పని పునరుద్ధరించిందనీ, పాత కార్మిక చట్టాల అమలు కు మేడే స్ఫూర్తితో కార్మిక వర్గం దీక్ష పూనాలన్నారు.
పై కార్యక్రమంలో యూనియన్ నాయకులు లంకాడ గణపతి, నాగరాజు, సుబ్బారావు, సత్యనారాయణ, బాపినీడు, వీర రాఘవులు, నంగాలు తదితరులు పాల్గొన్నారు.
Also read
- Chaturmasya Deeksha: చాతుర్మాస్యం అంటే ఏమిటి? విష్ణు యోగనిద్ర వెనుక రహస్యం తెలుసా..?
- Fasting Secrets: ఉపవాసాల సమయంలో సాధారణ ఉప్పు కాకుండా సైంధవ లవణమే ఎందుకు వాడతారో తెలుసా?
- నేటి జాతకములు 26 జూలై, 2026
- కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం – రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం..ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
- తల్లికి వందనం డబ్బుల కోసం భార్య హత్య





