హైదరాబాద్‌లో పోలీస్ కస్టడీలో ఉన్న ఓ అండర్ ట్రయల్ ఖైదీ ఆస్పత్రి నుంచి పరారవ్వడం కలకలం రేపుతోంది. పెట్లబుర్జ్‌లోని మోడర్న్ గవర్నమెంట్ మ్యాటర్నిటీ హాస్పిటల్ (MGMH)లో వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో సంచలనంగా మారింది.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘంటసాల త్రివేణి (26) అనే మహిళ చంచల్‌గూడ మహిళా జైలులో రిమాండ్ ఖైదీగా ఉంది. ఆమెను చెకప్ కోసం సోమవారం ఆస్పత్రికి తీసుకెళ్లారు.
సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుళ్లు ఝాన్సీ, మమత ఆమెను ఎస్కార్ట్ చేస్తుండగా.. ఉదయం సుమారు 11 గంటల సమయంలో త్రివేణి అక్కడి నుంచి తప్పించుకుంది. వెంటనే పోలీసులు ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ, ఆమె ఆచూకీ లభించలేదు.
త్రివేణి గతంలో రాంబోపాల్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మోసం కేసులో అరెస్టయింది. మ్యాట్రిమోనియల్ యాప్ ద్వారా బాధితుడితో పరిచయం పెంచుకుని, అనంతరం ఎంజీ రోడ్‌లోని ఓ హోటల్‌లో రూ.75 వేల నగదును దోచుకుందని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
ఆస్పత్రిలో చెకప్ సమయంలో వాష్‌రూమ్‌కు వెళ్లిన త్రివేణి.. అక్కడి నుంచి జనాల్లో కలిసిపోయి పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తూ, ఆమె కదలికలను ట్రాక్ చేయడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
Also read
- Garuda Purana: మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? గరుడ పురాణం ప్రకారం స్వర్గం, నరకం, వైకుంఠం రహస్యాలు
- సూర్యాస్తమయం తర్వాత ఈ 6 వస్తువులు కొనొద్దు.. లక్ష్మీదేవి అనుగ్రహానికి దూరమవుతారా? వాస్తు ఏం చెబుతోంది?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ.. కట్ చేస్తే..
- అర్థరాత్రి ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్ధాలు.. అనుమానం వచ్చి ఉదయం వెళ్లి చూడగా.. వామ్మో





