👉 భార్యను కాపురానికి పంపడం లేదని అత్తపై అల్లుడు దారుణం
👉 అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించాడు అల్లుడు
👉అల్లుడు మల్లారెడ్డి పై అత్త రాజవ్వ పోలీసులకు ఫిర్యాదు
భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సర్వ సాధారణమే. అయితే ఈ గొడవలు కాస్త చిలికి చిలికి గాలివానలా మారి విడాకులకు దారితీస్తుంటాయి. కొన్నిసార్లు హింసాత్మకంగా మారుతుంటాయి. తాజాగా జగిత్యాలలో దారుణ ఘటన వెలుగుచూసింది. భార్యను కాపురానికి పంపడం లేదని అత్తపై ఓ అల్లుడు దారుణానికి ఒడిగట్టాడు. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించాడు అల్లుడు. వెలగటూర్ మండలం జగదేవ్ పేట గ్రామానికి చెందిన గాగిరెడ్డి మల్లారెడ్డి (48), పద్మ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు.
కొంతకాలం వరకు సవ్వంగానే సాగిన వీరి కాపురం ఆ తర్వాత కలహాలు చోటుచేసుకున్నాయి. భార్య భర్తల మధ్య గొడవలు కాగా తన పిల్లలతో పుట్టింటికి వెళ్ళింది భార్య పద్మ.
తన భార్యను పద్మ తల్లి రాజవ్వ కాపురానికి పంపడం లేదని కోపం పెంచుకొని హతమార్చలని ప్లాన్ వేశాడు అల్లుడు గాగిరెడ్డి మల్లారెడ్డి. రాజవ్వ ఇంటి తలుపులకు విద్యుత్ అమర్చాడు. ఉదయం తలుపులు తెరువగానే రాజవ్వకు స్వల్పంగా విద్యుత్ షాక్ తగిలింది. అల్లుడు మల్లారెడ్డి పై అత్త రాజవ్వ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు వెల్గటూర్ పోలీసులు తెలిపారు.
Also read
- ఓర్నీ దుంపదెగ.. SIR వెరిఫికేషన్ పేరిట వచ్చి పుస్తెల తాడు తెంపుకుపోయిండ్రు!
- Ananthagiri Hills: అనంతగిరిలో ట్రెక్కింగ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ.. ఆ తర్వాత నిమిషాల్లోనే..
- భాగ్య, హన్నమ్మ మామూలు లేడీస్ కాదమ్మ.. బస్టాండ్లో వాళ్ల కంట పడ్డారో అంతే సంగతులు..
- కుక్కలను చంపే ఇంజెక్షన్ ఇచ్చి బావను చంపిన బావమరిది..! క్రైమ్ స్టోరీని మించిన స్కెచ్..
- ఆరు హత్యకేసుల నిందితుడు రాజ్ కుమార్ మృతి





