ఖాజీపేట: కడప జిల్లా ఖాజీపేటలో బాలికను గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది వెంకటేష్ పై పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసుల అదుపులో ఉన్న వెంకటేశ్ శనివారం తెల్లవారుజామున తప్పించుకునేందుకు యత్నించాడు. మైదుకూరు నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తున్న సమయంలో ఇద్దరు కానిస్టేబుళ్లను గాయపరిచాడు. పారిపోతున్న నిందితుడిని అడ్డుకునేందుకు పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. అయితే నిందితుడు ఎదురు తిరిగాడు. దీంతో అతడి కాళ్లపైకి పోలీసులు కాల్పులు జరిపారు. గాయపడిన నిందితుడిని కడప రిమ్స్్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఖాజీపేట అగ్రహారం గ్రామానికి చెందిన శ్రీనివాసులు, నాగ మునెమ్మ దంపతుల కుమార్తె(17) ఇంటర్ పూర్తి చేసింది. మండల పరిధిలోని ఆంజనేయ కొట్టాల గ్రామానికి చెందిన వెంకటేష్ కొంతకాలంగా ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని పలుమార్లు ఒత్తిడి చేయగా.. ఆమె నిరాకరిస్తూ వస్తోంది. దీంతో వెంకటేష్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అదను చూసి బాలిక ఇంటికి వచ్చిన అతడు తనను పెళ్లి చేసుకోవాలని మళ్లీ ఒత్తిడి తెచ్చాడు. ఆమె ససేమిరా అనడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు తన వెంట తెచుకున్న కత్తితో ఆమె గొంతుకోసి పరారయ్యాడు. ఈ విషయం తెలిసిన యువతి తండ్రి శ్రీనివాసులు, ఇతర కుటుంబ సభ్యులు హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. రక్తపు మడుగులో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కుమార్తెను తండ్రి శ్రీనివాసులు చేతుల్లో మోసుకొని వెళ్లి వాహనంలోకి చేర్చారు. ఆమెను కడప రిమ్స్్స్కు తరలించే ప్రయత్నం చేశారు. కొనఊపిరితో ఉన్న ఆమె.. వెంకటేష్ , ప్రవీణ్ ల పేర్లను తన తండ్రి వద్ద ప్రస్తావించింది. మిగతా విషయాలు చెప్పడానికి ప్రయత్నించినా.. మాట్లాడలేకపోయింది. ఆమె మార్గమధ్యలో చెన్నూరు వద్ద ప్రాణాలు విడిచింది.
కానిస్టేబుళ్లను పరామర్శించిన ఎస్పీ
వెంకటేష్ దాడిలో గాయపడిన కానిస్టేబుళ్లను కడప ఎస్పీ విశ్వనాథ్ పరామర్శించారు. అనంతరం ఎస్పీ మాట్లాడారు. “నిందితుడిని శిక్షించాలని బంధువులు, గ్రామస్థులు ఆందోళన చేశారు. దీంతో అతడిని వేరే ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నం చేశాం. ఆ సమయంలో పారిపోయేందుకు ప్రయత్నించి.. ఇద్దరు | కానిస్టేబుళ్లపై నిందితుడు దాడి చేశాడు. మైదుకూరు ఇన్స్పెక్టర్ హెచ్చరిస్తున్నా.. వినకుండా దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆత్మరక్షణ కోసం మా ఇన్స్పెక్టర్ నిందితుడిపై కాల్పులు జరిపారు. ప్రస్తుతం నిందితుడు కడప రిమ్స్ చికిత్స పొందుతున్నాడు. అమ్మాయిల పట్ల దారుణాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షిస్తాం” అని ఎస్పీ తెలిపారు.
Also read
- ఆదివారం తులసి మొక్కకు నీరు పోయకూడదని ఎందుకు అంటారు? నిజం తెలుసుకోండి!
- Astro Secrets: మీ రాశిని శాసించే ఆ జంతువు ఏంటో మీకు తెలుసా?.. జ్యోతిష్య శాస్త్రంలో దాగి ఉన్న ఆసక్తికరమైన రహస్యాలివే!
- Weekly Horoscope: వారికి అదృష్టం కలిసి రానుంది..! 12 రాశులకు వారఫలాలు
- నువ్వేం మనిషి అంజయ్య.. అత్తగారు బైక్ కొనిపెట్టలేదని.. భార్యను చంపి..
- రైల్వే స్టేషన్కు వెళ్తుండగా విరుచుకుపడ్డ మృత్యువు..భార్య, కొడుకు కళ్లెదుటే భర్త దుర్మరణం! ఏం జరిగిందో చూస్తే..





