రెండు కిలోల బంగారు ఆభరణాలు, రూ.26 లక్షలతో పరారీ
బెంగళూరు (యశ్వంతపుర): భర్తకు, పిల్లలకు దూరంగా ఉంటూ ఒంటరిగా ఉంటున్న ఓ సంపన్న మహిళను ఇద్దరు వ్యక్తులు నిలువునా ముంచేశారు. ఆమెనుంచి విడతల వారీగా బంగారం, డబ్బు తీసుకుని ఉడాయించారు. బెంగళూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించి నగర పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరుకు చెందిన ఓ వివాహిత(38)కు సామాజిక మాధ్యమాల ద్వారా తెలంగాణలోని చెన్నూరుకు చెందిన మహేశ్ అలియాస్ పృథ్వీరెడ్డి(34), ఏపీలోని అనంతపురం నివాసి వి.స్వామి (38) అనే వ్యక్తులు పరిచయమయ్యారు. ఆమె భర్త బిల్డర్ కాగా వారికి ఇద్దరు పిల్లలు. ఏడాదిన్నరగా కుటుంబానికి ఆమె దూరంగా, ఒంటరిగా జీవిస్తుండటంతో దానిని అలుసుగా తీసుకుని నిందితులు స్నేహం పెంచుకున్నారు. ఏవో అవసరాల కోసమంటూ రెండు కిలోల బంగారు నగలు, రూ.26 లక్షల నగదును విడతల వారీగా తీసుకున్నారు. నెల క్రితం కనిపించకుండా మాయమయ్యారు. దుండగుల మోసాన్ని ఆలస్యంగా గుర్తించిన బాధితురాలు.. పోలీసులను ఆశ్రయించడంతో నిందితులను పట్టుకున్నామని కమిషనర్ వెల్లడించారు.
కొంత బంగారాన్ని, సొమ్మును వారు ఇప్పటికే వాడేశారని, 571 గ్రాముల బంగారు నగలనే స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Also read
- Ongole: ఒంగోలులో మిస్టరీగా మారిన యువతి మరణం.. ఇంతకీ అతను ఎక్కడికి వెళ్లినట్లు..?
- దుర్గా నిమజ్జనం రాత్రిపూట ఎందుకు చేయకూడదు? సరైన సమయం, ముఖ్యమైన నియమాలు ఇవే!
- నవదుర్గలలో ఈరోజు 5వ రోజు – స్కందమాత, ఐదవ నవదుర్గ…!!*_
- దుర్గాపూజ ఐదు రోజుల విశిష్టత ఇదే.. షష్ఠి నుంచి విజయదశమి వరకు అమ్మవారి ఆరాధన వెనుక ఆధ్యాత్మిక రహస్యం!
- దుర్గాదేవి చేతిలోని 8 ఆయుధాలు మనకు చెప్పే 8 జీవిత పాఠాలు ఏమిటో తెలుసా!





