ఏడేళ్ల బాలికపై 70 ఏళ్ల వృద్దుడి అఘాయిత్యం
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలంలో దారుణం పెనుగొండ: పశ్చిమగోదావరి జిల్లాలో ముక్కుపచ్చలారని ఏడేళ్ల చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి 70 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ బాలిక నొప్పి అంటూ విలపించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. తల్లి ఆరా తీయడంతో వ్యవహారం బట్టబయలైంది.
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలంలోని ఓ గ్రామంలో వెలగన వెంకటస్వామి (70) సోడా షాపు నిర్వహిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన చిరు వ్యాపారం చేసుకునే దంపతుల ఏడేళ్ల కుమార్తె ఎల్కేజీ చదువుతోంది. మంగళవారం మధ్యాహ్నం బాలిక సోడా దుకాణానికి వెళ్లడంతో వెంకటస్వామి చాక్లెట్ ఇస్తానంటూ లోపలకు తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఇంటికి వెళ్లిన బాలిక రాత్రి సమయంలో అమ్మానొప్పి అంటూ విలపిస్తూ విషయాన్ని తల్లికి తెలియజేసింది. దీంతో బాలిక తల్లిదండ్రులు ఆచంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. నరసాపురం ఇన్చార్జి డీఎస్పీ రఘవీర్ విష్ణు ఘటనాస్థలికి చేరుకుని ఆరా తీశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపారు. పెనుగొండ సీఐ రాయుడు విజయకుమార్, ఆచంట ఎస్ఐ కె. వెంకటరమణ ఘటనపై విచారిస్తున్నారు. నిందితుడు వెలగల వెంకటస్వామి పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.
Also read
- ప్రేమ.. పెళ్లి.. కోటి రూపాయల మోసం! భార్యపై భర్త, అత్తింటి వారి దారుణ దాడి
- రికవరీ నగదు కాజేసిన న్యాయవాది.. ప్రశ్నించిన కానిస్టేబుల్ హత్యకు కుట్ర
- సహజీవనం.. మహిళ నాలుక కోసి పారిపోయిన ప్రియుడు
- ఇష్టమని ఎక్కువగా దోసెలు తిన్న బాలుడు.. కాసేపటికే ఘోరం!
- కలికాలం.. ఆస్తి కోసం కన్నతల్లి శవాన్ని ఎత్తుకెళ్లిన పెద్దకొడుకు.. శ్మశానంలో కోడిని పూడ్చిన చిన్నకొడుకు!





