గుంటూరు: నరసరావుపేట నియోజకవర్గంలోని మహిళా ఉద్యోగి ఇక్కడ ఇటీవల వరకు పనిచేశారు. ఆమె అంతకు ముందు వేరే మండలంలో పనిచేసిన సమయంలో అక్కడ అధికారి కార్యాలయ ప్రాంగణంలోనే కాకుండా, వాష్రూమ్ వంటి వ్యక్తిగత ప్రదేశాల వద్ద కూడా అనుసరిస్తూ ఆమెను భయభ్రాంతులకు గురిచేసేవిధంగా ప్రవర్తించాడు. అప్పట్లో దీనికి ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది, సూపరింటెండెంట్ ఇతర ఉద్యోగులు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు.
ఆ వేధింపుల తీవ్రత కారణంగా ఆ మహిళా ఉద్యోగి పనిచేయలేక సెలవులు పెట్టుకొన్నారు. ఆ మహిళ ప్రయాణించే సమయంలో కూడా ఆమె కారును అడ్డగించి వేధించడం, బెదిరించాడు. గత ఉద్యోగాల వివరాలు తెప్పించి తప్పుడు రిపోర్టులు రాసి సస్పెండ్ అయ్యేలా చేస్తానని, లైంగికంగా సహకరిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని, లేకపోతే జీవితం నాశనం చేస్తానంటూ అధికారి బహిరంగంగా బెదిరించాడంటూ తన ఫిర్యాదులో ఆ మహిళా ఉద్యోగి పేర్కొంది.
అతని నుంచి తన ప్రాణానికి, తన కుటుంబ భద్రతకు తక్షణ ముప్పు ఉందని, తనకు ఏదైనా అనూహ్య ఘటన జరిగితే, దానికి పూర్తి బాధ్యత సదరు అధికారిదేనని ఆ మహిళ పేర్కొంది. దీనిపై స్పందించిన జిల్లా అధికారులు ఆ ఉద్యోగిని మరో చోటికి బదిలీ చేశారు. సదరు మహిళా ఉద్యోగి సైతంమరో ప్రదేశంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Also read
- అయ్యో ఎంత పని చేశావ్ తల్లి.. ఉరివేసుకొని 5వ తరగతి బాలిక ఆత్మహత్య.. ఎందుకంటే?
- అయ్యో అనిత.. మరికాసేపట్లో డెలివరీ.. అంతలోనే వైద్యులు వచ్చి ఏం చెప్పారంటే..
- ఎంతకు తెగించార్రా..! రూ.30 వేల అప్పు కోసం 21 రోజుల పసికందు కిడ్నాప్..!
- Hyderabad: అంతా పక్కా స్కెచ్.. బెడిసికొట్టిన ఫ్లాన్.. ఏటీఎం చోరీ కేసులో సంచలన ట్విస్ట్!
- అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్తే.. నువ్వు చనిపోయావ్గా అన్నారు.. అసలు ఏమైందంటే..?





