హనుమకొండ జిల్లాలో దారుణం జరిగింది. రాత్రి భోజనం చేసిన ఇంట్లో నిద్రిస్తున్న తండ్రి కూతురు తెల్లవారేసరికి సజీవదహనం అయ్యారు. వారిని అతికిరాతకంగా పెట్రోల్ పోసి నిప్పట్టించిన అల్లుడు పిట్టకథ అల్లబోయాడు. బంధువులకు ఫోన్లు చేసి ప్రమాదం అని నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో అసలు కథ బయటపడింది. అల్లుడే హంతకుడని తేలింది.
ఈ దారుణ సంఘటన హనుమకొండ జిల్లా కడిపికొండ ప్రాంతానికి రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో జరిగింది. కూతురు రాజశ్రీ, తండ్రి రాజశేఖర్ సజీవ దహనం అయ్యారు. ఇంట్లో నిద్రిస్తున్న తండ్రి – కూతురు తెల్లవారేసరికి బూడిదయ్యారు. తండ్రి కూతురు ప్రమాదంలో చనిపోయారని వాళ్ళ అల్లుడు ప్రవీణ్ బంధుమిత్రులకు ఫోన్ ద్వారా తెలియపరచాడు. బంధుమిత్రులు ఏం ప్రమాదం జరిగిందో..! ఎలా చనిపోయారో అనే ఆందోళనతో పరుగులు పెడుతూ అక్కడికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సైతం సంఘటన స్థలానికి చేరుకున్నారు.
మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసులు దర్యాప్తు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇది ప్రమాదం కాదని.. ప్లాన్ ప్రకారం చేసిన మర్డర్ అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కుటుంబ కలహాలు నేపథ్యంలో అల్లుడు ప్రవీణ్ తన భార్య రాజశ్రీ, ఆమె తండ్రి రాజశేఖర్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించినట్టు పోలీసులు గుర్తించారు.
అయితే చింతల్ ప్రాంతానికి చెందిన ప్రవీణ్‌కు రాజీవ్ గృహకల్పకు చెందిన రాజశ్రీతో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొంతకాలంగా భార్యభర్తల మధ్య గొడవలు కొనసాగుతున్నాయి. అయితే ప్రవీణ్ ఏం పని లేకుండా తిరుగడం స్టార్ట్ చేశాడు. విషయం తెలుసుకున్న రాజశ్రీ తండ్రి రాజశేఖర్ కూతురి ఇంటికి వచ్చి అల్లుడు ప్రవీణ్‌ను మందలించారు. దీంతో తీవ్ర ఆగ్రహం చెందిన అల్లుడు తన భార్య, మామ ఇంట్లో నిద్రిస్తుండగా పెట్రోల్ పోసి అతి కిరాతకంగా హత్య చేశాడు. దాన్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కానీ చివరకు పోలీసులకు చిక్క కటకటాల పాలయ్యాడు.
Also read
- జలుబు చేసిందని RMP డాక్టర్ దగ్గరికి వెళ్తే.. ఏకంగా ప్రాణాలే పోయాయ్!
- సిని ఫక్కీలో చేజింగ్.. చైన్ స్నాచర్లను పట్టుకున్న సరిహద్దు గ్రామస్తులు..! మహిళ సహా..
- ‘చనిపోయిన 7 నిమిషాల తర్వాత కూడా మెదడు పనిచేస్తుందట.. అప్పుడూ నీ గురించే ఆలోచిస్తా..!’
- Hyderabad: అతన్ని గుడ్డిగా నమ్మింది.. హోటల్‌కు వెళ్లింది.. కట్‌చేస్తే.. అసలు మ్యాటర్ తెలిసి..
- అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం- ప్రొద్దుటూరులో అరుదైన నవగ్రహ మండపం విశేషాలివే!




